Best Electric Scooter In Cheap Price: ప్రెట్రోల్ ధరలు పెరగడం కారణంగా మధ్యతరగతి జీవనం గడుపుతున్నవారు వాహనాలు నడపలేకపోతున్నారు. కొన్ని ఆటో మొబైల్ కంపెనీలు దీనిని దృష్టిలో పెట్టుకుని అతి తక్కువ ధరల్లో ఎలక్ట్రిక్ బైక్‌లను విక్రయిస్తున్నాయి. పెద్ద కంపెనీలు కూడా ఎలక్రిక్ వాహనాలను తయారు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఎక్కువగా యువత మిడ్ రేంజ్ కలిగిన ఎలక్ట్రిక్ బైక్‌లను మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. అయితే దీనిని దృష్టిలో పెట్టుకుని స్టార్టప్ EV బైక్‌ల తయారీ కంపెనీ లెక్ట్రిక్స్ మార్కెట్‌లోకి ఎలక్ట్రిక్ స్కూటీని విడుదల చేసింది. ఈ బైక్ ఫీచర్స్, ధరకు సంబంధించిన మరిన్ని ఫీచర్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఎలక్ట్రిక్ బైక్ స్టార్టప్ కంపెనీ లెక్ట్రిక్స్ గురువారం తమ ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేసింది. కంపెనీ ఈ స్మార్ట్ బైక్‌ను LXS Moonshine లిమిటెడ్ ఎడిషన్ పేరుతో విడుదల చేసినట్లు ప్రకటించింది. అయితే ఆగస్టు 23 చారిత్రాత్మక మూన్ ల్యాండింగ్ జ్ఞాపకార్థం ఈ లిమిటెడ్ వేరియంట్‌ను విడుదల చేసినట్లు కంపెనీ పేర్కొంది. డిజైన్ పరంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటీ..కొత్త లుక్‌లో మార్కెట్‌లో లభిస్తోంది. ఈ వేరియంట్‌లో కొన్ని ఫీచర్లను అదనంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇంతక ముందుగా ఉన్న ఈ బైక్ ధరల కంపెనీ ఈ ఎడిషన్‌పై పెంచి విక్రయిస్తున్నట్లు సమాచారం.
లోగో మార్పులు:
ఇంతక ముందు ఉన్న లెక్ట్రిక్స్ లోగో కంటే ఈ లోగో ఆప్డేట్ లుక్‌లో కంపించబోతోంది. ఈ కొత్త లోగో లెక్ట్రిక్స్ మూన్‌షైన్ ఆకాశం వైపు రెండు బాణాలతో కూడిన బంగారు చిహ్నాన్ని కలిగి ఉంటుందని సమాచారం. భారత్‌లో అభివృద్ధి చెందుతున్న అంతరిక్ష పరిశోధనలను దృష్టిలో పెట్టుకుని ఈ లోగోను డిజైన్ చేసినట్లు కంపెనీ తెలిపింది. అయితే నిన్న విడుదల చేసిన LXS లక్ట్రిక్ స్కూటర్ స్టాండర్డ్ వేరియంట్‌తో సమానంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది.
లెక్ట్రిక్స్ మూన్‌షైన్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 89 కి.మీ వరకు ప్రయాణం చేయోచ్చు. ఈ స్కూటర్ 48-వోల్ట్ అధునాతన లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది. దీంతో పాటు 1200-వాట్ల ఎలక్ట్రిక్ మోటారుతో వస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా 50 kmph వేగాన్ని అందుకునే అవకాశాలు ఉన్నాయి. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని కంపెనీ పేర్కొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి