BSNL Best Recharge Plans: కేవలం 22 రూపాయలకే 90 రోజుల వ్యాలిడిటీ అందించే సూపర్ రీఛార్జ్ ప్లాన్ ఇదే

BSNL Best Recharge Plans: ప్రభుత్వ రంగ టెలీకం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఇటీవల కొత్త కొత్త ఆఫర్లు ప్రకటిస్తోంది. అందరినీ ఆకట్టుకునేందుకు వివిధ రకాల ప్లాన్స్ ప్రవేశపెడుతోంది. ఇప్పుడు లాంగ్ టైమ్ వ్యాలిడిటీని అతిత తక్కువ ధరకే అందిస్తోంది. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 19, 2023, 11:33 AM IST
BSNL Best Recharge Plans: కేవలం 22 రూపాయలకే 90 రోజుల వ్యాలిడిటీ అందించే సూపర్ రీఛార్జ్ ప్లాన్ ఇదే

BSNL Best Recharge Plans: బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు అత్యుత్తమ అత్యంత తక్కువైన రీఛార్జ్ ప్లాన్ ప్రకటించింది. ఇంటర్నెట్ వినియోగం తక్కువగా ఉండి..కాల్స్ కూడా పెద్దగా చేయని వారికి ఈ ఆఫర్ సరిపోతుంది. అదే సమయంలో ఎక్కువ వ్యాలిడిటీ కలిగి ఉండటం ఈ ప్లాన్ ప్రత్యేకత.

చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉన్నా సరే చాలామంది ఇంటర్నెట్ పెద్దగా వినియోగించరు. ఇంకొంతమంది ఫోన్‌ను అత్యవసరమైతే తప్ప వినియోగించరు. అంటే కాల్స్ కూడా పెద్దగా చేయరు. ఇప్పుడు మార్కెట్‌లో అందుబాటులో ఉన్న వివిధ కంపెనీ ఆఫర్ ప్లాన్స్ పరిశీలిస్తే ఇలాంటి వారికి అవన్నీ వృధా తప్ప మరొకటి కానేకాదు. ఇలాంటి వారికోసం ఎక్కువ వ్యాలిడిటీ అనేది అతి ముఖ్యం. అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటా పెద్దగా లేకపోయినా ఫరవాలేదు. ఈ తరహా వ్యక్తుల కోసమో బహుశా బీఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టిన బెస్ట్ ఛీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్ సరిపోతుంది. డేటా పెద్దగా వినియోగించకుండా, కాల్స్ పెద్దగా చేయకుండా ఫోన్‌ను అత్యవసరానికి ఉపయోగించేవారికి ఎక్కువ వ్యాలిడిటీ అవసరమౌతుంది. అలాంటి వ్యక్తుల కోసమే ఈ ఆఫర్. ఇదే 22 రూపాయల రీఛార్జ్ ప్లాన్. ఈ ఆఫర్‌తో చాలా ప్రయోజనాలున్నాయి. ఇందులో వ్యాలిడిటీ చాలా ఎక్కువ. ఇంత తక్కువ ధరకు ఇన్ని రోజుల వ్యాలిడిటీ అంటే చాలా గొప్ప విషయమే. 

కేవలం ఎక్కువ వ్యాలిడిటీ మాత్రమే చూస్తుంటే ఇదే ది బెస్ట్ రీఛార్జ్ ప్లాన్. 22 రూపాయల ఈ ప్లాన్‌లో వ్యాలిడిటీ ఎంతో వింటే ఆశ్చర్యపోతారు. ఏకంగా 90 రోజుల కాల వ్యవధిని అందిస్తోంది బీఎస్ఎన్ఎల్.  కేవలం 22 రూపాయలకు ఇన్ని రోజుల వ్యాలిడిటీ ఆశ్చర్యమే మరి. ఖరీదైన రీఛార్జ్ ప్లాన్స్ కూడా ఏవీ 90 రోజుల వ్యాలిడిటీ అందించడం లేదు. 700-800 రూపాయలు వసూలు చేసి కూడా 84 రోజుల వ్యాలిడిటీ మాత్రమే అందిస్తున్నారు. అలాంటిది 22 రూపాయలకు 90 రోజుల వ్యాలిడిటీ అంటే ఊహించని ఆఫర్ ఇది. 

ఇందులో లోకల్, ఎస్టీడీ కాల్స్‌కు నిమిషానికి 30 పైసలు వసూలు చేస్తారు. డేటా ఈ ప్లాన్‌తో రాదు. డేటా కావాలంటే విడిగా రీఛార్జ్ చేయించుకోవచ్చు. ముందే చెప్పినట్టు ఇంటర్నెట్ వినియోగించకుండా, కాల్స్ పెద్దగా చేయకుండా ఉండేవారికి బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ ప్లాన్ అద్భుతంగా పనిచేస్తుంది. 

Also read: Metro vs Rapid Rail: ర్యాపిడ్ రైలంటే ఏంటి, మెట్రోకు ర్యాపిడ్ రైలుకు ఉన్న అంతరమేంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News