Best Gaming SmartPhones: బెస్ట్ గేమింగ్ 4 స్మార్ట్‌ఫోన్‌లు ఇవే.. ధర తక్కువ, ఫీచర్స్ ఎక్కువ! ఇక ఆలస్యం ఎందుకు

Cheapest Gaming SmartPhones in India 2023. బెస్ట్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ కోసం వెతుకుతుంటారు. అలాంటి వారికోసం కొన్ని రూ. 50000 లోపు 5 ఉత్తమ గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో ఉన్నాయి.  

Written by - P Sampath Kumar | Last Updated : Feb 16, 2023, 07:22 PM IST
  • బెస్ట్ గేమింగ్ 4 స్మార్ట్‌ఫోన్‌లు ఇవే
  • ధర తక్కువ, ఫీచర్స్ ఎక్కువ
  • ఇక ఆలస్యం ఎందుకు
Best Gaming SmartPhones: బెస్ట్ గేమింగ్ 4 స్మార్ట్‌ఫోన్‌లు ఇవే.. ధర తక్కువ, ఫీచర్స్ ఎక్కువ! ఇక ఆలస్యం ఎందుకు

Cheapest Gaming SmartPhones in India 2023: ప్రస్తుత రోజుల్లో గేమింగ్ పట్ల ప్రతీ ఒక్కరికి మక్కువ ఉంటుంది. ఖాళీ సమయంలో ఆన్‌లైన్ మొబైల్ గేమ్‌ను ఆడేందుకు అందరూ చూస్తుంటారు. ముఖ్యంగా యువత మొబైల్ గేమ్‌ ఎక్కువగా ఆడుతుంటారు. అయితే కొందరి వద్ద గేమింగ్ స్మార్ట్‌ఫోన్ ఉండదు. బడ్జెట్ ఎక్కువగా ఉండడంతో కొందరు గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌లను కొనలేరు. మరికొందరేమో బెస్ట్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ కోసం వెతుకుతుంటారు.  అలాంటి వారికోసం కొన్ని బెస్ట్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. రూ. 50000 లోపు 5 ఉత్తమ గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో ఉన్నాయి. ఈ జాబితాలో iQOO 9T, Xiaomi 11T Pro, Samsung Galaxy A73, Realme GT 2 Pro మరియు Xiaomi 12 Pro ఉన్నాయి. 

iQOO 9T:
ఐక్యూ ఫోన్ గేమింగ్‌కు ప్రసిద్ధి చెందింది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్‌సెట్‌తో వస్తుంది. ఈ ఐక్యూ ఫోన్ 50MP ప్రైమరీ షూటర్, 13MP వైడ్ యాంగిల్ లెన్స్ మరియు 12MP పోర్ట్రెయిట్ కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. 120W ఫ్లాష్‌ఛార్జ్‌, 4700mAh బ్యాటరీ ఇందులో ఉంటాయి. 20 నిమిషాల్లో స్మార్ట్‌ఫోన్‌ పూర్తిగా ఛార్జ్ అవుతుంది. 8GB + 128GB వేరియంట్‌ ధర (అమెజాన్) రూ. 49,999.

Xiaomi 11T Pro:
షియోమీ 11టీ ప్రో 6.67-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 888 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. ఇందులో 108MP బ్యాక్ కెమెరా, 8MP అల్ట్రావైడ్ లెన్స్ మరియు 5MP మాక్రో లెన్స్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 16MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5000mAh బ్యాటరీతో వస్తుంది. 12GB + 256GB వేరియంట్‌ (అమెజాన్) ధర రూ. 40,000.

Realme GT 2 Pro:
రియల్ మీ జీటీ 2 ప్రో స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 50MP ప్రైమరీ, 50MP అల్ట్రా వైడ్ మరియు 3MP మైక్రోస్కోప్ లెన్స్‌తో వస్తుంది. 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 65W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000 mAh బ్యాటరీని కలిగి ఉంది. 12GB + 256GB వేరియంట్‌ ధర (ఫ్లిప్‌కార్ట్‌) రూ. 47999.

Xiaomi 12 Pro:
షియోమీ 12 ప్రో స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 చిప్‌సెట్‌తో వస్తుంది. ఈ ఫోన్ 50MP వైడ్ లెన్స్, 50MP టెలిఫోటో కెమెరా మరియు 50MP అల్ట్రావైడ్ లెన్స్‌తో ఉంటుంది. 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4600 mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. 8GB + 256GB వేరియంట్‌ ధర (ఫ్లిప్‌కార్ట్‌) రూ. 49990.

Also Read: Albino Cobra Viral Video: రేర్ అల్బినో కోబ్రా.. చూస్తేనే వణుకుపుడుతుంది! ఈ వ్యక్తి ఎంత ఈజీగా పట్టాడో 

Also Read: Naga Chaitanya Custody : ఒక్క పాట కోసం ఏడు సెట్లు.. నాగ చైతన్య, కృతి శెట్టిలపై భారీ ఖర్చు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News