Flipkart Mobile Phones Offer: ఫ్లిప్‌కార్ట్‌లో మరోసారి బొనాంజా ఆఫర్, బ్రాండెడ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఇంకా రెండ్రోజులే

Flipkart Mobile Phones Offer: ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడో అద్భుత ఆఫర్ నడుస్తోంది. ఒప్పో నుంచి మోటో వరకూ వివిధ రకాల స్మార్ట్‌ఫోన్లు అత్యంత చౌకధరకే అందుతున్నాయి. ఆ వివరాలు మీ కోసం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 12, 2022, 05:54 PM IST
Flipkart Mobile Phones Offer: ఫ్లిప్‌కార్ట్‌లో మరోసారి బొనాంజా ఆఫర్, బ్రాండెడ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఇంకా రెండ్రోజులే

ఫ్లిప్‌కార్ట్‌‌లో దసరా, దీపావళి ప్రత్యేక సేల్స్ అనంతరం ఇప్పుడు మొబైల్ ఫోన్స్ బొనాంజా సేల్ ప్రారంభమైంది. ఇందులో వివిధ రకాల స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు లభిస్తున్నాయి. ఈ ఆఫర్ వినియోగించుకుంటే చాలా తక్కువ ధరకే బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లు సొంతం చేసుకోవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ ఈ కామర్స్ వేదిక నుంచి ఇప్పుడు మరో ఆఫర్ సేల్ నడుస్తోంది. అదే ఫ్లిప్‌కార్ట్ మొబైల్ ఫోన్స్ బొనాంజా సేల్. అత్యంత చౌకధరకు మొబైల్ ఫోన్ కొనాలనుకుంటే ఇదే మంచి అవకాశం. ఇందులో ఒప్పో ఎం 21 నుంచి మొటోరోలా ఎస్ 30 వరకూ ఉన్నాయంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ నిజమే. మంచి మంచి బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్ ఇప్పుడు అందుబాటులో ఉంది. ఖరీదైన స్మార్ట్‌ఫోన్లు కూడా చౌకధరకే మీ సొంతం చేసుకోవచ్చు. ఇదొక అద్భుత అవకాశం. 30 వేలలోపు స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేయాలనుకుంటే ఇదే మంచి ప్రత్యామ్నాయం.

Xiaomi 11i Hypercharge 5G

Xiaomi 11i Hypercharge 5G ఫ్లిప్‌కార్ట్‌లో 25,999 రూపాయలకు లిస్ట్ అయింది. ఇది కాకుండా కొన్ని ఎంపిక చేసిన బ్యాంకుల క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే..నేరుగా 2000 రూపాయలు డిస్కౌంట్ లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రోసెసర్‌తో పాటు 4500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం ఉంది. ఇక కెమేరా అయితే ఏకంగా 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా కాగా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమేరా ఉంది. 

Vivo V25 5G

ఈ స్మార్ట్‌ఫోన్ ధర ఫ్లిప్‌కార్ట్‌లో 27,999 రూపాయలకు లిస్ట్ అయింది. Vivo V25 5Gలో యూనిక్ కలర్ ఛేంజింగ్ డిజైన్ ఓ ప్రత్యేకతగా ఉంది. అంటే మీరు ఫోన్ రంగును మార్చుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్ అందిస్తోంది. ఇది కాకుండా బ్యాంక్ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే..2000 రూపాయల డిస్కౌంట్ అందుతుంది. ఈ ఫోన్‌ను మీరు నో కాస్ట్ ఈఎంఐపై కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ విధానంలో ఈఎంఐ నెలకు 4,667 రూపాయలతో ప్రారంభం కానుంది.

Oppo F21 Pro 5G

ఈ స్మార్ట్‌‌ఫోన్‌పై 18 శాతం డిస్కౌంట్ అనంతరం Oppo F21 Pro 5G ఫ్లిప్‌కార్ట్ లో 25,999 రూపాయలకు లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే 6.43 ఇంచెస్‌తో 2400 x 1080 పిక్సెల్ రిజల్యూషన్ కలిగి ఉంది. ఇందులో 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమేరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమేరా ఉన్నాయి. దాంతోపాటు 2 మెగాపిక్సెల్ మైక్రో కెమేరా ఉంది. 

Realme GT Neo 3T

Realme GT Neo 3T స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో 24,999 రూపాయలు లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 870 ప్రోసెసర్ కలిగి ఉంది. దీని సెల్ఫీ కెమేరా 16 మెగాపిక్సెల్‌గా ఉంది. 

Motorola Edge 30

Motorola Edge 30 స్మార్ట్‌ఫోన్ మొటోరోలాలో బెస్ట్ మోడల్. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో మంచి డిస్కౌంట్ లభిస్తోంది.  Motorola Edge 30 స్మార్ట్‌ఫోన్ 26,999 రూపాయలకు లిస్ట్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ రెండు రంగుల్లో అందుబాటులో ఉంది. మెటావర్ గ్రే, ఆరోరా గ్రీన్ రంగుల్లో ఆకర్షణీయంగా కన్పిస్తోంది. ఇందులో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 778 జి ఆక్టా కోర్ ప్రోసెసర్, 4020 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.

Also read: Aadhaar Card: పదేళ్లు దాటితే ఆధార్ కార్డు అప్‌డేట్ చేయించాలా, యూఐడీఏఐ ఏమంటోంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News