Google Pixel 9 Series: ఆగస్టు 13న గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ లాంచ్, టెంప్ట్ చేసే ఫీచర్లు

Google Pixel 9 Series Features: ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది. వచ్చే నెలలో ప్రపంచవ్యాప్తంగా గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ లాంచ్ కానుంది. ఇప్పటికే లీక్ అయిన ఈ ఫోన్ ఫీచర్లు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 8, 2024, 08:15 AM IST
Google Pixel 9 Series: ఆగస్టు 13న గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ లాంచ్, టెంప్ట్ చేసే ఫీచర్లు

Google Pixel 9 Series Features: త్వరలో సరికొత్త ఫీచర్లతో Google Pixel 9 Series స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. ఇప్పటి వరకూ ఏ ఇతర ఫోన్‌లో లేనటువంటి అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్‌తో గూగుల్ పిక్సెల్ 9 లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ ఫోన్ లాంచ్ తేదీ ఇతర వివరాలు తెలుసుకుందాం.

గూగుల్ ప్రతి యేటా కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేస్తుంటుంది. ప్రస్తుతం గూగుల్ నుంచి అప్‌కమింగ్ మోడల్ గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ లాంచ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఫోన్ ఫీచర్లు ఇప్పటికే లీక్ అయ్యాయి. ఈసారి గూగుల్ కొత్తగా అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉపయోగించనుంది. ఈ సిరీస్‌లో క్వాల్‌కామ్ 3డి సోనిక్ జనరేషన్ 2 ప్రోసెసర్ ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటివరకూ గూగుల్ అన్ని ఫోన్లలో స్లో ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉపయోగించింది. ఇకపై అన్ని స్మార్ట్‌ఫోన్లలో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వినియోగించవచ్చు. ఫోల్డ్ డివైస్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కలిగి ఉంటుంది. 

గూగుల్ పిక్సెల్ 9, గూగుల్ పిక్సెల్ 9 ప్రో, గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఎక్స్‌ఎల్, గూగుల్ పిక్సెల్ 9 ఫోల్డ్ ఫోన్‌లు ఆగస్టు 13న లాచ్ కానున్నాయి. మేడ్ బై గూగుల్ ఈవెంట్‌లో ఈ ఫోన్లు లాంచ్ కానున్నాయి. భారత కాలమానం ప్రకారం ఆగస్టు 13 రాత్రి 10.30 గంటలకు లాంచ్ ఉంటుంది. స్మార్ట్‌ఫోన్లతో పాటు గూగుల్ పిక్సెల్ బడ్స్ ప్రో 2, పిక్సెల్ వాచ్ 3 కూడా ఆవిష్కరించనుంది గూగుల్ కంపెనీ. 

గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ఫోన్లు టెన్సార్ జి4 చిప్‌సెట్‌పై పనిచేస్తాయి. ఈ ఈవెంట్‌లోనే గూగుల్ ఏ1, ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ కూడా లాంచ్ కానున్నాయి. గూగుల్ ఏ1 ఫీచర్‌తో పాటు ఆండ్రాయిడ్ 15 ఆధారంగా పనిచేయనుంది. గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ జెమిని, సర్కిల్ టు సెర్చ్, యాడ్ మి, స్డూడియో, స్క్రీన్ షాట్ వంటి ఏ1 ఫీచర్లు అందుబాటులో రానున్నాయి. గూగుల్ పిక్సెల్ 9 ప్రోలో టెలీఫోటో సెన్సార్‌తో పాటు ట్రిపుల్ కెమేరా సెటప్ ఉంటుంది. 

Also read: CNAP Feature: ఎవరు ఫోన్ చేస్తున్నారో ట్రూ కాలర్ కంటే కచ్చితంగా చెప్పే ఫీచర్ జూలై 15 నుంచి అమలు

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News