GoVo GoBuds 945 True Wireless Earbuds: మార్కెట్లో వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని కొత్త కొత్త కంపెనీలు ఎలక్ట్రిక్ వస్తువులను విక్రయించేందుకు ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఎలక్ట్రిక్ వస్తువులైన ఇయర్ బడ్స్, పవర్ బ్యాంకులను మార్కెట్లో ఉన్న అన్ని ఎలక్ట్రిక్ కంపెనీలు తయారు చేస్తున్నాయి. ఇటీవల GOVO ఎలక్ట్రిక్ కంపెనీ త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేయబోతోంది. ఇందులో ఇంతకుముందు ఎప్పుడూ చూడని చాలా రకాల కొత్త ఫీచర్లతో కస్టమర్లకు వినియోగంలోకి తీసుకురాబోతున్నట్లు కంపెనీ తెలిపింది. ఇప్పటికే ఈ ఇయర్ బడ్స్ కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అధికారిక వెబ్సైట్లో పేర్కొంది.
GOVO ఇయర్ బడ్స్ క్రోమ్ ఎక్స్(Chrome X ) టెక్నాలజీతో మార్కెట్లోకి విడుదల చేయబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇయర్‌బడ్స్‌లో డైనమిక్ 12mm డ్రైవర్లుతో పాటు డీప్ బాస్ తో అందుబాటులోకి రానున్నాయి. ఇక ఆడియో విషయానికొస్తే..బ్లూటూత్ V5.3 కనెక్టివిటీతో పాటు డాల్బీ లాంటి అవుట్ ఫుట్ లభించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. 3డి సౌండ్ సిస్టంను కూడా అందించబోతున్నట్లు కంపెనీ తెలిపింది.
Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా
ఇయర్ బడ్స్ ఒక్కసారి ఛార్జింగ్ పెడితే దాదాపు 52 గంటల పాటు ప్లే బ్యాక్ లభిస్తుంది. GOVO GoBuds 945 వేరియంట్‌లో టచ్ కంట్రోల్ ఫీచర్ కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ కంట్రోల్ సిస్టం ద్వారా నావిగేట్ చేయడానికి, వాల్యూమ్ సర్దుబాటు కోసం, కాల్ లిఫ్ట్ చేయడానికి సులభతరంగా ఉంటుంది. ఈ ఇయర్ బర్డ్స్ 400mAh బ్యాటరీని కలిగి ఉన్నాయి. అంతేకాకుండా ఫాస్ట్ చార్జింగ్ కోసం టైప్ సి పోర్టును కూడా కలిగి ఉంటుంది.
క్లియర్ కాల్ క్వాలిటీ కోసం 4 మైక్‌లతో మార్కెట్లోకి విడుదల చేయబోతున్నట్లు GOVO కంపెనీ వివరించింది. అంతేకాకుండా ఈ ఇయర్ బడ్స్ వాయిస్ క్లారిటీని పెంచే ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ (ENC) సపోర్ట్ ఫీచర్ ని కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఇయర్ బడ్స్ గేమ్స్ ఆడే వారి కోసం ఇతర ఫీచర్లను కూడా ప్రవేశపెట్టబోతున్నట్లు కంపెనీ అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. ఇక ఈ స్మార్ట్ ఎయిర్ బడ్స్ ధర విషయానికొస్తే.. సాధారణ వినియోగదారులకు లభించే విధంగా రూ. 4,999లకే మార్కెట్లోకి విడుదల చేయబోతున్నట్లు కంపెనీ పేర్కొంది.
Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook