Hmd Aura: చీప్‌ ధరలో 128GB స్టోరేజ్‌ Hmd Aura మొబైల్‌ లాంచ్‌.. దీని ప్రత్యేకత ఏమిటంటే?

Hmd Aura Smartphone: ప్రీమియం ఫీచర్స్‌తో HMD టెక్‌ కంపెనీ నుంచి ఆరా స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ అయ్యింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌ డెడ్‌ చీప్ ధరకే అందుబాటులో ఉంది.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 24, 2024, 04:27 PM IST
Hmd Aura: చీప్‌ ధరలో 128GB స్టోరేజ్‌ Hmd Aura మొబైల్‌ లాంచ్‌.. దీని ప్రత్యేకత ఏమిటంటే?

Hmd Aura Smartphone: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్ హెచ్‌ఎండీ మార్కెట్‌లోకి తమ స్మార్ట్‌ఫోన్స్‌తో ఎంట్రీ ఇచ్చింది. అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన మొబైల్స్‌ విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్స్ అతి తక్కువ ధరలోనే 4GB ర్యామ్‌తో అందబాటులోకి వచ్చాయి. అయితే కంపెనీ దీనిని Aura పేరుతో లాంచ్‌ చేసింది. ఇది ప్రీమియం డిస్ల్పేతో పాటు బేసిక్‌ కెమెరా సెటప్‌తో లభిస్తోంది. HMD గ్లోబల్ ఈ మొబైల్‌ను ఆస్ట్రేలియాలో అందుబాటులోకి తీసుకు వచ్చింది. అయితే త్వరలోనే గ్లోబల్‌ లాంచింగ్‌ కూడా చేయబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. అంతేకాకుండా యూరప్‌లో కూడా ఇటీవలే మూడు వేర్వేరు మోడళ్లతో ఎంట్రీ-లెవల్ రిపేరబిలిటీ-ఫోకస్డ్ పల్స్ సిరీస్‌ను విడుదల చేసిన సంగంతి అందరికీ తెలిసిందే. అయితే ఈ మూడు మోడల్స్‌కి మార్కెట్‌లో మంచి గుర్తింపు లభించింది. ఆస్ట్రేలియాలో లాంచ్‌ అయిన HMD ఆరా సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

HMD ఆరా ఫీచర్స్‌:
ఈ HMD ఆరా స్మార్ట్‌ఫోన్‌ 6.56-అంగుళాల IPS LCD డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. ఇది 900 x 1600 పిక్సెల్‌ల రిజల్యూష్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఈ మొబైల్‌ ఫ్రాంట్‌ సెటప్‌లో వాటర్ డ్రాప్ కటౌట్ కూడా కలిగి ఉంటుంది. ఈ మొబైల్‌ ఆండ్రాయిడ్ 13పై రన్‌ అవుతుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ రెండు కలర్‌ ఆప్షన్స్‌లో విడుదల చేసింది. ఈ మొబైల్‌ ప్రస్తుతం గ్లేసియర్ గ్రీన్, ఇండిగో బ్లాక్ కలర్స్‌లో లభిస్తోంది. 

4GB ర్యామ్‌, శక్తివంతమైన ప్రాసెసర్:
ఈ Nokia C31 స్మార్ట్‌ఫోన్‌ 28nm Unisoc SC9863A1 ప్రాసెసర్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఇది 4GB ర్యామ్‌తో పాటు 64GB స్టోరేజ్‌తో లభిస్తోంది. అలాగే ఎంతో శక్తివంతమైన 5000 mAh బ్యాటరీతో లభిస్తోంది. అలాగే గీక్‌బెంచ్ 6 CPU పరీక్షలో సింగిల్-కోర్‌లో 160 స్కోర్‌ సాధించిన్నట్లు తెలుస్తోంది. ఇక మల్టీ-కోర్‌లో 725 స్కోర్ చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ఇది వెబ్ బ్రౌజింగ్, వీడియో స్ట్రీమింగ్ మొదలైన పనులను ఎంతగానో సహాయపడుతుంది. ఇక ఈ మొబైల్‌కి సంబంధించిన ధర వివరాల్లోకి వెళితే, 4GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన వేరియంట్‌ రూ. 12,500కే లభిస్తోంది. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

ఇతర ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
10W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌
5000 mAh బ్యాటరీ
ఛార్జింగ్ కోసం USB టైప్-C పోర్ట్‌
13-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా
5-మెగాపిక్సెల్ కెమెరా 
3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News