Honor 200 Pro Price: ప్రముఖ మొబైల్ కంపెనీ హానర్ (Honor) గుడ్ న్యూస్ తెలిపింది. ప్రీమియం ఫీచర్స్‌తో ఈ కంపెనీ మరో రెండు స్మార్ట్‌ఫోన్స్‌ను లాంచ్ చేసింది. దీనిని కంపెనీ Honor 90, Honor X9b పేర్లతో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్స్ కంపెనీ భారతదేశంలో కూడా అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు మొబైల్స్ ఒకటి హానర్ 200 సిరీస్ పేరుతో భారత్‌లో లాంచ్ కానుంది. అంతేకాకుండా ఈ విడుదలకు సంబంధించిన టీజర్ కంపెనీ ఇప్పటికే అమెజాన్‌లో లైవ్ అవుతోంది. దీనిని కంపెనీ హానర్ 200, హానర్ 200 ప్రో పేర్లతో చైనాలో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మొబైల్ సిరీస్‌కి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
ఇప్పటికే అమెజాన్ ఇండియాలో ఈ సిరీస్‌కి సంబంధించిన ల్యాండింగ్ పేజీని కూడా రన్ చేస్తోంది. అయితే దీనిని బట్టి చూస్తే ఈ మొబైల్స్ త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కంపెనీ ఈ సిరీస్‌ను జూన్ 12న పారిస్‌లో గ్లోబల్ లాంచ్ ఈవెంట్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో ఓ టాక్ కూడా నడుస్తోంది. ఈ సిరీస్‌కి సంబంధించిన స్మార్ట్‌ఫోన్స్ భారత్‌లో లాంచ్ అయితే యాపిల్ ఐఫోన్స్‌తో పోటీ పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇటీవలే కొంతమంది టిప్‌స్టర్స్ ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన స్పెసిఫికేషన్లు, డిజైన్‌ను లీక్ చేశారు. లీక్ అయిన ఫీచర్స్ వివరాల ప్రకారం, ఈ మొబైల్ 2664x1200 పిక్సెల్ రిజల్యూషన్‌తో కూడిన డిస్ల్పేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది గరిష్టంగా 16GB ర్యామ్‌తో పాటు 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌తో అందుబాటులోకి రానుంది. అలాగే ఈ మొబైల్ Qualcomm Snapdragon 7 Gen 3 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. దీంతో పాటు 200 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.7-అంగుళాల పూర్తి HD ప్లస్ కర్వ్డ్ OLED డిస్ప్లేను కూడా కలిగి ఉంటుంది. ఈ సిరీస్ స్మార్ట్‌ఫోన్ ధరలు రూ. 28,700 నుంచి ప్రారంభం కాబోతున్నాయి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కెమెరా
50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా
12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్ కెమెరా
5200mAh బ్యాటరీ సెటప్
100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్
డ్యూయల్ సిమ్ సపోర్ట్
5G కనెక్టివిటీ
Android 14 ఆధారంగా MagicOS 8.0
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి