HP Laptops: హెచ్‌పి కంపెనీ అత్యంత శక్తివంతమైన రెండు ల్యాప్‌టాప్స్ లాంచ్ చేసింది. ఈ రెండు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత HP Elite Book Ultra, HP Omni Book X మార్కెట్‌లో హల్‌చల్ చేయనున్నాయి. రిటైల్ కస్టమర్లు, విద్యార్ధులు, టెక్ నిపుణులు, స్టార్టప్స్ ఇలా అందరికీ బెస్ట్ ల్యాప్‌టాప్ కానుంది.
హెచ్‌పి కంపెనీ లాంచ్ చేసిన ఈ రెండు ల్యాప్‌టాప్‌లు స్నాప్‌డ్రాగన్ ఎక్స్ ఎలైట్ ప్రోసెసర్ కలిగి న్యూరల్ ప్రోసెసింగ్ యూనిట్ సామర్ధ్యంతో పనిచేస్తాయి. సెకన్‌కు 45 ట్రిలియన్ ఆపరేషన్స్ నిర్వహించే సామర్ధ్యం కలిగినవి. HP Elite Book Ultra అయితే బిజినెస్ కేటగరీ వ్యక్తులకు ప్రత్యేకంగా డిజైన్ చేసినట్టుంటుంది. చాలా పల్చగా, శక్తివంతమైన బ్యాటరీ కలిగి ఉంటుంది. ఇక డేటా సెక్యూరిటీ బాగుంటుంది.
HP Omni Book X ప్రత్యేకంగా క్రియేటర్లు, ఫ్రీ లాన్సర్లకు డిజైన్ చేసింది. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్లు చాలా ఉంటాయి. ఫలితంగా వీడియో క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైన్, రిమోట్ మీటింగ్స్ ఎలాంటి అంతరాయం లేకుండా సాగాలంటే ఇది బెస్ట్ ఆప్షన్. ల్యాప్‌టాప్ మార్కెట్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టెక్నాలజీ కచ్చితంగా సంచలనం కల్గించనుంది. ఏఐ జోడించడం ద్వారా హెచ్‌పి కంపెనీ సరికొత్త విప్లవం తీసుకురానుంది.
Also read: Ghee Remedies: రోజూ 1 చెంచా నెయ్యి ఇలా తీసుకుంటే ఈ 5 రోగాలకు చెక్ పెట్టవచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.