Infinix Hot 30I Price Cut: ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్స్‌కి మార్కెట్లో మంచి గుర్తింపు ఉంది. అతి తక్కువ ధరలోనే ప్రీమియం ప్రాసెసర్స్‌తో అందుబాటులోకి రావడం వల్ల చాలా మంది యువత ఈ కంపెనీ సంబంధించిన మొబైల్స్‌ను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా మెగ్గు చూపారు. అయితే మీరు కూడా ఇన్ఫినిక్స్ బ్రాండ్‌లో మంచి మొబైల్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేకమైన డీల్స్‌ను అందిస్తోంది. ఇటీవలే మార్కెట్లోకి లాంచ్ అయిన Infinix Hot 30i స్మార్ట్‌ఫోన్ డెడ్ చీప్ ధరలోనే లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రస్తుతం ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్‌లో Infinix Hot 30i స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్స్‌లో లభిస్తోంది. అంతేకాకుండా నాలుగు కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం 4 GB ర్యామ్, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మొబైల్ MRP ధర రూ.9,999తో అందుబాటులో ఉంది. దీనిని ఫ్లిఫ్‌కార్ట్ అందిస్తున్న ప్రత్యేకమైన డీల్‌లో భాగంగా కొనుగోలు చేస్తే దాదాపు రూ.1600 వరకు తగ్గింపుతో రూ. 8,399కే లభిస్తుంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్ వివరాల్లోకి వెళితే, ఫ్లిఫ్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లిస్తే దాదాపు 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు ఈ మొబైల్‌పై ఇతర ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
ఇన్ఫినిక్స్ హాట్ 30i ఫీచర్లు:
ఇక Infinix Hot 30i స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ వివరాల్లోకి వెళితే, ఈ స్మార్ట్‌ఫోన్ 6.6-అంగుళాల HD+ IPS డిస్ప్లే సెటప్‌లో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు పాండా గ్లాస్ ప్రోటక్షన్‌తో లభిస్తోంది. అలాగే ఎంతో శక్తివంతమైన G37 ప్రాసెసర్‌తో అందుబాటులో ఉంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్ స్కిన్ విషయానికొస్తే, ఇది ఆండ్రాయిడ్ 12 ఆధారంగా XOS 12 సాఫ్ట్వేర్ సెటప్‌పై రన్ అవుతుంది. దీంతో పాటు కంపెనీ అదనంగా స్టోరేజీని పెంచుకునే ప్రత్యేకమైన ఆప్షన్స్‌ను కూడా అందిస్తోంది.
Also Read: Save The Tigers 2: బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్.. ఇండియా టాప్ 3 లిస్టులో ‘సేవ్ ది టైగర్స్’
ఈ మొబైల్ బ్యాక్ సెటప్‌లో భాగంగా..ఇది 50MP ప్రైమరీ లెన్స్ కెమెరాతో లభిస్తోంది. అంతేకాకుండా శక్తివంతమైన AI సెన్సార్‌తో లభిస్తోంది. అలాగే డ్యూయల్ కెమెరా సెటప్‌తో అందుబాటులోకి వచ్చింది. అలాగే ఈ మొబైల్ 5MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. దీంతో పాటు ప్రస్తుతం ఇది డైమండ్ వైట్, గ్లేసియర్ బ్లూ, మిర్రర్ బ్లాక్ వంటి కలర్ ఆప్షన్స్‌లో లభిస్తోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన బ్యాటరీ వివరాల్లోకి వెళితే, ఇది 10W ఛార్జింగ్ సపోర్ట్‌తో అతి శక్తివంతమైన 5000mAh బ్యాటరీతో మార్కెట్లోకి లాంచ్ అయ్యింది. ఇవే కాకుండా ఈ మొబైల్ అనేక రకాల కొత్త ఫీచర్స్‌తో లభిస్తోంది.
Also Read: Save The Tigers 2: బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్.. ఇండియా టాప్ 3 లిస్టులో ‘సేవ్ ది టైగర్స్’
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook