Infinix Zero Book : మార్కెట్‌లోకి మిడ్-రేంజ్‌లో Infinix Zero Book Ultra ల్యాప్‌ట్యాప్‌..ధర ఎంతో తెలుసా..?

Infinix Zero Book : Infinix కంపెనీ నుంచి ఇన్ఫినిక్స్ జీరో బుక్ అల్ట్రా పేరుతో ల్యాప్‌ట్యాప్‌ మార్కెట్‌లోకి విడుదల కానుంది. అయితే ఇది వినియోగదారులకు భారీ బడ్జెట్‌తో లభించనుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 25, 2023, 12:48 PM IST
Infinix Zero Book : మార్కెట్‌లోకి మిడ్-రేంజ్‌లో Infinix Zero Book Ultra ల్యాప్‌ట్యాప్‌..ధర ఎంతో తెలుసా..?

Infinix Zero Book : Infinix మిడ్-రేంజ్ ఫోన్ Infinix Note 12i ఈ రోజు భారతదేశంలో లాంచ్ కానుంది. AMOLED స్క్రీన్‌తో పాటు అతి తక్కువ ధరలో లభించనుంది. ఈ ఫోన్‌ చాలా రకాల కొత్త ఫీచర్లతో అందుబాటులోకి వస్తుందని  సమాచారం. అయితే దీని ధర చాలా చౌకగా ఉండబోతోంది. తక్కవ బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్లు కలిగిన మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఈ ఫోన్‌ సరైనదిగా చెప్పొచ్చు. ఇదే కంపెనీకి చెందిన మరికొన్ని ఉత్పత్తులు కూడా మార్కెట్‌లోకి విడుదల కాబోతున్నాయి. జనవరి 31న  ఇన్ఫినిక్స్ జీరో బుక్ సిరీస్ మార్కెట్‌లోకి రాబోతోంది. అయితే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఇన్ఫినిక్స్ జీరో బుక్ అల్ట్రా:
ఇన్ఫినిక్స్ డిసెంబర్ 2021లో INBook X1 ల్యాప్‌టాప్‌ను ప్రారంభించింది. ఇక 2022లో ఇన్‌బుక్ X1 స్లిమ్, ఇన్‌బుక్ X1 నియో, ఇన్‌బుక్ X2 ప్లస్‌లతో సహా మూడు కొత్త ల్యాప్‌టాప్‌లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇప్పుడు కంపెనీ జీరో బుక్, జీరో బుక్ అల్ట్రాలను ప్రకటించడానికి సిద్ధంగా ఉంది. రాబోయే జీరో బుక్ సిరీస్ భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇన్ఫినిక్స్ ల్యాప్‌టాప్ కంటే ఎక్కువ ధరను కలిగి ఉంటుందని నిపుణులు అంచనాలు.

Infinix జీరో బుక్ అల్ట్రా కాన్ఫిగరేషన్:
Infinix Zero Book Ultra 12 జనరేషన్‌ ఇంటెల్ కోర్ H ప్రాసెసర్‌తో పాటు..కోర్ i5, Core i7, Core i9తో రాబోతోంది. జీరో బుక్ సిరీస్ నాలుగు కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంటుంది (16 GB RAM + 512 GB ఇంటర్నాల్‌ స్టోరెజ్‌, 16 GB RAM + 512 GB స్టోరెజ్‌, 32 GB RAM + 1 TB స్టోరెజ్‌ కోర్ i9తో 32 GB RAM + 1 TB స్టోరెజ్‌లతో మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు సమాచాం.

Infinix జీరో బుక్ అల్ట్రా ధర:
భారత మార్కెట్‌లో ఇన్ఫినిక్స్ జీరో బుక్ అల్ట్రా ధర రూ. 90,000 కాగా.. ఈ కామర్స్‌ వెబ్‌సైట్స్‌లో తక్కువ ధరకే రాబోతున్నట్లు సమాచారం. ల్యాప్‌టాప్‌లో AI బ్యూటీక్యామ్ ఫీచర్‌తో కూడిన FHD వెబ్ కెమెరా ఫీచర్‌తో పాటు.. 15.6-అంగుళాల FHD LED-బ్యాక్‌లిట్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 96W ఛార్జింగ్‌కు సఫోర్ట్‌ కూడా లభించనుంది.

Aso Read: Pawan Kalyan's Fan Death News: పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి.. అభిమాని మృతి

Also Read:l RGV on Pawan: గుడిలో ఉంటే వారాహి, రోడ్డు మీద ఉంటే పంది.. పవన్ పై మళ్లీ రెచ్చిపోయిన వర్మ! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News