Jio Hotstar Subscription: భారత్ Vs పాకిస్థాన్ మ్యాచ్‌కు సిద్ధంగా ఉన్నారా? అయితే ఈ జియో బంపర్ ఆఫర్ మీకోసమే‌!

Jio Hotstar Subscription: ప్రపంచ కప్ 2023 మన దేశంలో జరుగుతున్న సంగతి తెలిసిందే! అయితే జియో తన యూసర్ల కోసం కొత్త ఆఫర్లను తీసుకొచ్చింది. రీచార్జ్ చేసుకుంటే.. జియో, డిస్నీ + హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ తో పాటు టీవీ షోలు, సినిమాలు, వెబ్ సిరీస్ ఆస్వాదించవచ్చు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 6, 2023, 08:42 PM IST
Jio Hotstar Subscription: భారత్ Vs పాకిస్థాన్ మ్యాచ్‌కు సిద్ధంగా ఉన్నారా? అయితే ఈ జియో బంపర్ ఆఫర్ మీకోసమే‌!

Jio Hotstar Subscription: భారత మార్కెట్లో ప్రస్తుతం ఉన్న ఓటీటీ సంస్థలో పాపులర్ అయినవి జియో, డిస్నీ + హాట్ స్టార్. ప్రేక్షకులకు వినోదాన్ని అందించడమే కాకుండా క్రికెట్ అభిమానులకు మరింత ప్రయోజనకరంగా మారారు. అయితే ప్రస్తుతం జరుగుతోన్న క్రికెట్ ప్రపంచ కప్ 2023తో పాటు రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ సహా ఇతర క్రికెట్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ లను ఈ రెండు ఓటీటీ యాప్స్ ద్వారా చూసేందుకు అవకాశం ఉంది. అయితే ఈ రెండింటి సభ్యత్వం తీసుకోవాలి. అయితే దీని రుసుముపై తగ్గింపు పొందే అవకాశం ఉంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్లాన్స్ తో జియో సినిమాతో పాటు డిస్నీ + హాట్ స్టార్ యాప్స్ లో లైవ్ క్రికెట్ మ్యాచ్ లను అతి తక్కువ ధరకే వీక్షించవచ్చు. వీటితో పాటు ఇతర టీవీ షోలు, సినిమాలు, వెబ్ సిరీస్ ఆస్వాదించవచ్చు.

జియో రూ. 328 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్
ప్రముఖ టెలికాం సంస్థ జియో సరికొత్త ప్లాన్స్ తో తమ కస్టమర్లను ఆకర్షిస్తోంది. అత్యంత సరసమైన ధరకే జియో రీఛార్జ్ తో పాటు డిస్నీ + హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ సొంతం చేసుకోవచ్చు. రూ. 328 లకే 3 నెలల డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు 28 రోజుల పాటు రోజువారీ 1.5 GB డేటాను పొందవచ్చు. ఇది ప్రస్తుతం జరుగుతున్న క్రికెట్ ప్రపంచ కప్ ను కవర్ చేస్తుంది. 

జియో రూ. 758 రీఛార్జ్ ప్లాన్
జియో టెలికాం సంస్థ మరో ప్లాన్ ను ప్రవేశపెట్టింది. కేవలం రూ. 758 ప్రీ పెయిడ్ రీఛార్జ్ ప్లాన్ తో 84 రోజుల పాటు కాల్స్ రోజూ 1.5 GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. ఇందులో 3 నెలల పాటు డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ లభించడంతో క్రికెట్ అభిమానులతో పాటు టీవీ షోలు, వెబ్ సిరీస్ లు ఆస్వాదించవచ్చు. 

Also Read: Kishan Reddy: దారుసలం వెళ్లి వంగి వంగి దండాలు పెడుతున్నారు.. ఎందుకంటే..?: కిషన్ రెడ్డి  

జియో రూ. 388 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్
అంతే కాకుండా రూ. 388 ప్రీ పెయిడ్ రీఛార్జ్ ప్లాన్ తో Disney + Hotstar సబ్‌స్క్రిప్షన్ అందుబాటులో ఉంది. దీంతో 28 రోజుల పాటు రోజువారీ 2 GB డేటాతో పాటు 3 నెలల డిస్నీ + హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ రానుంది. ఇదే 2 GBతో రూ. 808 రీఛార్జ్ తో 84 రోజుల వ్యాలిడిటీ లభించనుంది. 

జియో రెండు ప్రీమియం ప్లాన్‌లు
వీటితో పాటు రెండు ప్రీమియమ్ ప్లాన్స్ కూడా వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. రూ. 598 రీఛార్జ్ తో 84 వ్యాలిడిటీ.. రూ. 3,178 రీఛార్జ్ తో వార్షిక ప్లాన్స్ ఉన్నాయి. రూ. 598 రీఛార్జ్ ప్లాన్ వినియోగదారులకు 84 రోజుల పాటు రోజుకు 2 GB హై-స్పీడ్ డేటాతో పాటు ఏడాది పాటు డిస్నీ + హాట్ స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తున్నారు. మరోవైపు రూ. 3,178 వార్షిక ప్లాన్ తో ఏడాది పాటు డిస్నీ + హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ తో పాటు వీడియో లైబ్రరీ కూడా ఎల్లప్పుడూ యాక్సెస్ చేసుకోవచ్చు.

Also Read: Revanth Reddy: కేసీఆర్ ఏమన్నా బాహుబలి నా.. అద్దంలో ముఖం చూసుకో..: రేవంత్ రెడ్డి కౌంటర్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News