Lava Blaze X 5G Price: మరీ ఇంత చీపా? Lava Blaze X మొబైల్‌పై ఏకంగా రూ.15,100 తగ్గింపు..

Lava Blaze X 5G Price: 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన Lava Blaze X 5G స్మార్ట్‌ఫోన్‌ అత్యధిక తగ్గింపుతో లభిస్తోంది. దీనిని అమెజాన్‌లో కొనుగోలు చేసేవారికి రూ.898కే పొందవచ్చు. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న ఆఫర్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Aug 21, 2024, 03:14 PM IST
Lava Blaze X 5G Price: మరీ ఇంత చీపా? Lava Blaze X మొబైల్‌పై ఏకంగా రూ.15,100 తగ్గింపు..

Lava Blaze X 5G Price: అత్యంత ధరలోనే మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అది కూడా కార్డ్వ్‌ డిస్ల్పేతో.. ఇది సరైన అవకాశంగా భావించవచ్చు. ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌ కొన్ని స్మార్ట్‌ఫోన్స్‌ అత్యధిక డిస్కౌంట్‌తో లభిస్తోంది. ముఖ్యంగా కొన్ని బ్రాండ్‌లకు సంబంధించిన మొబైల్‌ డెడ్ చీప్‌ ధరల్లోనే లభిస్తున్నాయి. గతంలో మార్కెట్‌లోకి విడుదలైన Lava Blaze X 5G స్మార్ట్‌ఫోన్‌ భారీ డిస్కౌంట్‌ అందుబాటులో ఉంది. అయితే అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌పై అందుబాటులో ఉన్న ఆఫర్స్‌ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం అమెజాన్‌లో Lava Blaze X 5G స్మార్ట్‌ఫోన్‌ మూడు స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. ఇందులోని మొదటి వేరియంట్‌ 4GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో లభిస్తోంది. ఇక రెండవ వేరియంట్‌ 6GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌, మూడవ వేరియంట్‌ 8GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఆప్షన్‌లో అందుబాటులో ఉన్నాయి. మార్కెట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ బేస్‌ వేరియంట్‌ MRP ధర రూ.17,999తో అందుబాటులో ఉంది. అయితే దీనిని అమెజాన్‌లోని ప్రత్యేకమైన డీల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి రూ.15,998కే పొందవచ్చు.

అలాగే ఈ Lava Blaze X 5G స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. వీటిని వినియోగించాలనుకునేవారు ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే క్రమంలో యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌తో పేమెంట్ చేస్తే దాదాపు రూ.1,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు యస్ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌, డెబిట్‌ కార్డ్‌లను వినియోగించి కూడా ప్రత్యేకమైన డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఇవే కాకుండా ఇతర బ్యాంక్‌లకు సంబంధించిన ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని వినియోగించి ప్రత్యేకమైన డిస్కౌంట్ లభిస్తుంది.

ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌ ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ను అందిస్తోంది. దీనిని వినియోగించి కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్ లభిస్తుంది. అయితే  డిస్కౌంట్ పొందడానికి ముందుగా పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.15,100 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో అన్ని ఆఫర్స్‌ పోను ఈ స్మార్ట్‌ఫోన్‌ కేవలం రూ.898కే పొందవచ్చు.  

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News