200Mp Camera Phones: 200 మెగాపిక్సెల్ కెమెరా కలిగిన ఈ మొబైల్స్‌పై రూ. 20,400 తగ్గింపు..డిస్కౌంట్ పూర్తి వివరాలు!

Most Affordable Phones 2023: 200 మెగాపిక్సెల్ కెమెరా కలిగి స్మార్ట్‌ ఫోన్స్‌ను అతి తక్కువ ధరతోనే పొందవచ్చు. దీంతో పాటు కొన్ని మొబైల్స్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్స్‌పై ఉన్న ఇతర ఆఫర్స్‌ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 26, 2023, 06:50 AM IST
 200Mp Camera Phones: 200 మెగాపిక్సెల్ కెమెరా కలిగిన ఈ మొబైల్స్‌పై రూ. 20,400 తగ్గింపు..డిస్కౌంట్ పూర్తి వివరాలు!

 

Most Affordable Phones 2023: రాబోయే కొత్త సంవత్సరంలో మంచి స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్‌ చేస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్‌ మీ కోసం ప్రత్యేక సేల్‌ను ప్రారంభించింది. వింటర్ డేస్ సేల్‌ పేరుతో డిసెంబర్‌ 31వ తేది వరకు కొనసాగించబోతున్నట్లు ఫ్లిఫ్‌కార్ట్‌ వెల్లడించింది. అయితే ఈ సేల్‌లో భాగంగా అన్ని బ్రాండ్‌కు సంబంధించిన స్మార్ట్ ఫోన్స్‌ డెడ్‌ చీప్‌గా లభిస్తున్నాయి. డిసెంబర్ 31 వరకు జరిగే ఈ సేల్‌లో 200 మెగాపిక్సెల్ కెమెరాలతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లు కూడా MRP కంటే చాలా చౌకగా ధరతో పొందవచ్చు. దీంతో పాటు Infinix, Redmi, Realme బ్రాండ్‌ మొబైల్స్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌తో పాటు ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ సేల్‌లో ఏయే బ్రాండ్‌ స్మార్ట్‌ ఫోన్స్‌పై ఈ ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
 
Realme 11 Pro+ 5G:
ప్రస్తుతం ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ Realme 11 Pro+ 5G స్మార్ట్ ఫోన్‌ 8 GB ర్యామ్‌, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌తో లభిస్తోంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ MRP ధర  రూ.25,999 కాగా..ఈ వింటర్ డేస్ సేల్‌లో భాగంగా  రూ.25,999కే లభిస్తోంది. దీంతో పాటు ఫ్లిప్‌కార్ట్ ఈ మొబైల్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. బ్యాంక్ ఆఫర్స్‌ను వినియోగించి ఈ స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ.1,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు ఈ Realme 11 Pro+ 5G మొబైల్‌పై ఎక్చేంజ్ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. దీనిని వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు రూ.20,300 వరకు తగ్గింపు లభిస్తుంది. 

Also read: Corona New Variant: భయపెడుతున్న కరోనా కొత్త వేరియంట్, కేరళ, తెలంగాణలో పెరుగుతున్న కేసులు

Redmi Note 12 Pro+ 5G:
ఈ Redmi Note 12 Pro+ 5G స్మార్ట్ ఫోన్‌ ఫ్లిఫ్‌కార్ట్‌లో  8 GB ర్యామ్‌, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్‌ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఈ వేరియంట్‌ ధర MRP రూ. 33,999 కాగా ఈ సేల్‌లో భాగంగా 17% తగ్గింపుతో కేవలం రూ. 27,999కే లభిస్తోంది. దీంతో పాటు మీరు ఈ మొబైల్‌ను  కొన్ని బ్యాంక్‌లకు సంబంధించి డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌ను కొనుగోలు చేస్తే రూ.3,000 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ హోల్డర్‌లకు 5% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. దీంతో పాటు ఈ మొబైల్‌పై రూ. 20,400 వరకు ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా పొందవచ్చు

Infinix Zero Ultra:
ప్రస్తుతం ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ స్మార్ట్ ఫోన్‌  8 GB RAM + 256 GB ఇంటర్నల్ స్టోరేజ్‌ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది. దీని MRP రూ. 49,999 కాగా వింటర్‌ ప్రత్యేక సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్‌ 40 శాతం ప్రత్యేక తగ్గింపుతో కేవలం రూ.29,999లకే లభిస్తోంది. దీంతో పాటు బ్యాంక్‌ ఆఫర్స్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే అదనంగా 10 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా ఈ మొబైల్‌ను రూ.22,350 వరకు తగ్గింపు పొందవచ్చు. 

Also read: Corona New Variant: భయపెడుతున్న కరోనా కొత్త వేరియంట్, కేరళ, తెలంగాణలో పెరుగుతున్న కేసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News