Samsung Galaxy M35 5G Leaked: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ సాంసంగ్ మొబైల్స్‌కి మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా మిడ్ రేంజ్‌లో లంభించే కొన్ని మొబైల్స్‌కి ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. అయితే దీనిని దృష్టిలో పెట్టుకుని గత కొన్ని సంవత్సరాల నుంచి కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్స్‌ను లాంచ్ చేస్తూ వస్తోంది. ముఖ్యంగా ఇటీవలే లాంచ్ అయిన ఎమ్ సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ మంచి ప్రజాదరణ లభించడంతో కంపెనీ ఈ సిరీస్‌లోనే మరో కొత్త స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి లాంచ్ చేయబోతోంది. కంపెనీ తమ కొత్త ఎమ్ సిరీస్ మొబైల్‌ను Samsung Galaxy M15 5G పేరుతో అందుబాటులోకి రాబోతోంది. అయితే ఇది ఇంతక ముందు విడుదల చేసిన మోడల్స్ కంటే ప్రీమియం ఫీచర్స్‌తో లభించబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్ ఏంటో? ధర వివరాలు ఇప్పడు తెలుసుకోండి..
ఇటీవలే సాంసంగ్ లాంచ్ చేసిన Samsung Galaxy M15 5G స్మార్ట్‌ఫోన్ అతి తక్కువ ధరలోనే ఎంతో శక్తివంతమైన ఫీచర్స్‌తో లభించబోతోంది. అయితే విడుదలకు ముందు ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన మోడల్ నంబర్ GCF సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కనిపించింది. దీనిని కంపెనీ గ్లోబల్ లాంచింగ్‌లో భాగంగా SM-M356B/DS మోడల్ నెంబర్‌తో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే విడుదలకు ముందే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన కొన్ని ఫీచర్స్ ప్రముఖ టిప్‌స్టర్స్ లీక్ చేశారు. అయితే లీక్ అయని వివరాల ప్రకారం, ఈ మొబైల్ బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ సపోర్ట్‌తో అందుబాటులోకి రాబోతోంది.
అలాగే GCF లిస్టింగ్‌లో పేర్కొన్నవివరాల ప్రకారం..ఈ స్మార్ట్‌ఫోన్ 12 నెట్‌వర్క్ బ్యాండ్‌లకు సపోర్ట్ కలిగి 5G కనెక్టివిటీతో రాబోతున్నట్లు సమాచారం. అలాగే ఈ మొబైల్ గురించి 91మొబైల్స్ తమ వెబ్‌సైట్‌లో ప్రత్యేకమైన విషయాలను పేర్కొంది. ఇది 25W ఛార్జర్ సపోర్ట్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఇంతక ముందు ఇలా విడుదల చేసిన ఎమ్ సిరీస్ మొబైల్‌కి ప్రత్యేకమైన ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను అందించిన్నప్పటికీ ఇందులో మాత్రం ఎంతో ప్రత్యేకమైన 25W ఛార్జర్ మద్దతును కలిగి ఉండబోతున్నట్లు టిప్‌స్టర్స్ తెలిపారు. ఇవే కాకుండా ఈ మొబైల్ అనేక రకాల శక్తి వంతమైన ఫీచర్స్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు, ధర, విడుదల తేదిని కంపెనీ త్వరలోనే వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
6.6 అంగుళాల పెద్ద HD+ ఇన్ఫినిటీ-V డిస్‌ప్లే
శక్తివంతమైన ఆక్టా-కోర్ ప్రాసెసర్
ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్
13MP ప్రధాన కెమెరా
5MP అల్ట్రా-వైడ్ కెమెరా
2MP డెప్త్ సెన్సార్ కెమెరా
5MP సెల్ఫీ కెమెరా
5000mAh బ్యాటరీ
15W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్
128GB స్టోరేజ్
బ్లూటూత్ 5.0
USB టైప్-C కనెక్టివిటీ
ఫింగర్‌ప్రింట్ సెన్సార్
Android 10 ఆపరేటింగ్ సిస్టమ్
Also Read: PM Modi To Host Dinner Party: ఢిల్లీ పోలీసులకు ప్రధాని మోదీ డిన్నర్ పార్టీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook