Nothing Phone: 12జీబీ ర్యామ్, 50MP కెమేరాతో నధింగ్ 2ఎ, ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్ కూడా

Nothing Phone: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో చాలా రకాల ఫోన్లు ఉన్నాయి. అందులో నథింగ్ ఒకటి. అద్భుతమైన ఫీచర్లు, డిజైన్ ఉండటంతో అందరూ ఇష్టపడుతుంటారు. ఇప్పుడు కొత్తగా Nothing 2a లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఫీచర్లు, ధర ఇతర వివరాలు తెలుసుకుందాం

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 26, 2024, 02:52 PM IST
Nothing Phone: 12జీబీ ర్యామ్, 50MP కెమేరాతో నధింగ్ 2ఎ, ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్ కూడా

Nothing Phone: బ్రిటీషుకు చెందిన నథింగ్ టెక్నాలజీస్ లిమిటెడ్ నథింగ్ పేరుతో ఉత్పత్తి చేసే స్మార్ట్ ఫోన్లకు మంచి డిమాండ్, క్రేజ్ ఉంది. ఇప్పుడు నథింగ్ 2ఎ పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్ ఇటీవల ఇండియాతో పాటు ప్రపంచ మార్కెట్‌లో లాంచ్ అయింది. మూడు రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Nothing 2A అనేది 6.7 ఇంచెస్ పుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. 120 రిఫ్రెష్ రేట్ కలిగి ఉండటంతో రిజల్యూషన్ అద్భుతంగా ఉంటుంది. సౌండ్ ఎఫెక్ట్ కూడా చాలా బాగుంటుంది. 4కే రిజల్యూషన్ వీడియోల అనుభూతి పొందవచ్చు. ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగింది. ఇక ఈ ఫోన్ మొత్తం 3 స్టోరేజ్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఇందులో 8జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్, 12జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్ సామర్ధ్యంతో ఉన్నాయి. 

ఇక కెమేరా విషయంలో 50 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో పాటు మరో 50 మెగాపిక్సెల్ అల్టా వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. ఇక సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 32 మెగాపిక్సెల్ కెమేరా ఉంది. నథింగ్ 2ఎ లో 8జీబీ ర్యామ్-128జీబీ స్టోరేజ్ ఫోన్ ధర 23,999 రూపాయలు కాగా, 8జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్ అయితే 25,999 రూపాయలు, 12జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్ 27,999 రూపాయలకు లభ్యమౌతోంది. 

ఇది కాకుండా వివిధ బ్యాంకు కార్డులపై క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఇక ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. మంచి కండీషన్, లేటెస్ట్ మోడల్ ఫోన్ అయితే ఎక్స్చేంజ్‌పై ఏకంగా 20 వేల వరకూ తగ్గుతుంది. 

Also read: Royal Enfield New Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి కొత్తగా 650 సిసి బైక్స్, 3 బైక్స్ లాంచ్‌కు సిద్ధం

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News