Oneplus Ace 3V Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ వన్‌ప్లస్ మోస్ట్ ఎవైటెడ్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ ఏస్ 3విను మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. ఈ మొబైల్ గతంలో OnePlus Ace 2V స్మార్ట్‌ఫోన్‌ను పోలీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీనిని కంపెనీ అతి శక్తివంతమైన ఫీచర్స్‌తో విడుదల చేసింది. ఇది Snapdragon 7+ Gen 3 ప్రాసెసర్‌తో లాంచ్ అయ్యింది. ప్రస్తుతం ఈ మొబైల్‌ను వన్‌ప్లస్ చైనాలో మాత్రమే విడుదల చేసింది. అతి త్వరలోనే దీనిని కంపెనీ గ్లోబల్ లాంచింగ్ చేయబోతున్నట్లు వెల్లడించింది. అలాగే ఈ మొబైల్ అనేక రకాల ప్రీమియం AI ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు అద్భుతమైన డిజైన్‌తో అందుబాటులోకి వచ్చిన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన స్పెషిఫికేషన్స్, ఫీచర్స్, ధర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
వన్‌ప్లస్ ఏస్ 3వి (OnePlus Ace 3V) ఫీచర్స్:
మార్కెట్‌లోకి లాంచ్ అయిన OnePlus Ace 3V స్మార్ట్‌ఫోన్ ఇతర మోడల్‌తో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ మొబైల్ ఫ్లాట్ ఫ్రేమ్ సెటప్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫ్రేమ్‌లో భాగంగా కుడి వైపున పవర్, వాల్యూమ్ రాకర్ బటన్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇక బ్యాక్ ఫ్యానెల్ వివరాల్లోకి వెళితే ఇది.. డ్యూయల్ కెమెరా సెటప్‌తో లభిస్తోంది. దీంతో పాటు IP65 రేటింగ్‌తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా మరెన్నో ఫీచర్స్‌ను కలిగి ఉంది.
డిప్లే వివరాలు:
వన్‌ప్లస్ ఏస్ 3వి (OnePlus Ace 3V) స్మార్ట్‌ఫోన్ పంచ్-హోల్ కటౌట్ కలిగిన OLED డిస్‌ప్లే ప్యానెల్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఈ మొబైల్ ఇంటిగ్రేటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌తో లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్ స్క్రీన్ రెయిన్ టచ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. దీంతో పాటు ఇది 6.7 అంగుళాలు, 1.5K రిజల్యూషన్ కలిగిన డిస్ల్పేతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌ను కలిగిన ఉంటుంది.
కెమెరా, బ్యాటరీ పూర్తి వివరాలు:
వన్‌ప్లస్ ఈ స్మార్ట్‌ఫోన్‌ను డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని బ్యాక్ సెటప్‌లో 50-మెగాపిక్సెల్ Sony IMX882 ప్రధాన కెమెరా ఉంటుంది. అదనంగా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలతో లభిస్తోంది. దీంతో పాటు 16-మెగాపిక్సెల్ కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ మొబైల్ బ్యాటరీ వివరాల్లోకి వెళితే, ఈ స్మార్ట్‌ఫోన్ 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. అలాగే ఇతర ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంటుంది.
OnePlus Ace 3V ధర వివరాలు:
OnePlus Ace 3V స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ మూడు స్టోరేజ్ వేరియంట్స్‌లో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ మొబైల్ 12GBర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర CNY 1,999 (సుమారు రూ. 23,000) ఉంటుంది. ఇక 12GB ర్యామ్, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 26,500తో మార్కెట్‌లో లాంచ్ అయ్యింది. ఇక టాప్ వేరియంట్ ధర రూ.30,000కు లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ మొత్తం రెండు కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇది మ్యాజిక్ పర్పుల్ సిల్వర్, టైటానియం ఎయిర్ గ్రే కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి