Oneplus Nord Ce4 Lite Price: రూ.18 వేలకే అదిపోయే Oneplus Nord Ce4 Lite మొబైల్‌.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌!

Oneplus Nord Ce4 Lite Price: ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లో కొత్త వన్‌ప్లస్‌ నార్డో సీఈ4 లైట్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ అయ్యింది. దీని సేల్‌ జూలై 20వ తేది నుంచి ప్రారంభం కాబోతోంది. అయితే ఈ సేల్‌లో కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్స్‌ ఆఫర్స్‌ లభిస్తున్నాయి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 16, 2024, 02:43 PM IST
Oneplus Nord Ce4 Lite Price: రూ.18 వేలకే అదిపోయే Oneplus Nord Ce4 Lite మొబైల్‌.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌!

Oneplus Nord Ce4 Lite Price: ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌లో త్వరలోనే ప్రైమ్‌ డేస్‌ ప్రారంభం కాబోతున్నాయి. ఈ సేల్‌లో భాగంగా ఎలక్ట్రిక్‌ వస్తువులను కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ లభిస్తున్నాయి. అంతేకాకుండా కొన్ని ఎలక్ట్రిక్‌ పరికరాలపై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అలాగే ఈ ప్రైమ్‌ డేస్‌ సేల్‌లో భాగంగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలకు సంబంధించి మొబైల్‌ కూడా అతి తక్కువ ధరలకే అందుబాటులో ఉంటాయి. అలాగే Oneplus Nord Ce4 Lite స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన మొదటి సేల్‌ కూడా ప్రారంభం కాబోతోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న ఆఫర్ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

మొదటి సేల్‌లో భాగంగా Oneplus Nord Ce4 Lite స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే వారికి అత్యంత తగ్గింపుతో లభిస్తోంది. దీంతో పాటు అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ అసలు ధర రూ.20 వేల పైగా ఉండగా ప్రైమ్‌ డేస్‌ సేల్‌లో భాగంగా ఇది కేవలం రూ.18,999కే లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనంగా ఇతర ఆఫర్స్‌ కూడా లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే దీనిపై కంపెనీ ప్రత్యేకమైన ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. దీనిని వినియోగించి కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్‌ పొందవచ్చు. 
    
వన్‌ప్లస్‌ నార్డో సీఈ4 లైట్ స్మార్ట్‌ఫోన్‌ టాప్‌ ఫీచర్స్‌:
1. 6.67-అంగుళాల 120Hz AMOLED డిస్ప్లే: ఈ ఫోన్‌లో 2400 x 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.67-అంగుళాల AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుది. 120Hz రిఫ్రెష్ రేట్ స్మూత్ స్క్రోలింగ్,  గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

2. Qualcomm Snapdragon 695 5G చిప్‌సెట్: ఈ మొబైల్‌ ఎంతో శక్తివంతమైన Qualcomm Snapdragon 695 5G చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇది 5G కనెక్టివిటీని అందిస్తుంది.

3. 8GB ర్యామ్‌, 128GB / 256GB స్టోరేజ్: ఈ స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌తో పాటు 128GB లేదా 256GB స్టోరేజ్‌తో వస్తోంది. 

4. ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్: ఈ స్మార్ట్‌ఫోన్‌ బ్యాక్‌ సెటప్‌లో 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP మాక్రో కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంటుంది.

5. 16MP సెల్ఫీ కెమెరా: ఈ మొబైల్‌ 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఇది అధిక-రిజల్యూషన్ కలిగిన ఆబ్జెక్టులను చిత్రికరించేందుకు సహాయపడుతుంది.

6. 5500mAh బ్యాటరీ: ఈ ఫోన్ 5500mAh బ్యాటరీతో వస్తుంది. ఇది ఒక రోజుకు పైగా మొబైల్‌ను వాడుకునే సామర్థ్యాన్ని అందిస్తుంది.

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

7. 80W SuperVOOC ఛార్జింగ్: ఈ స్మార్ట్‌ఫోన్‌ 80W SuperVOOC ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇది కేవలం 30 నిమిషాల్లో 50% వరకు ఛార్జ్ చేసుకోవచ్చు.

8. ఆక్సిజెన్‌OS 14: ఈ ఫోన్ ఆక్సిజెన్‌OS 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఇది Android 14పై పని చేస్తుంది.

9. 3.5mm హెడ్‌ఫోన్ జాక్: ఈ మొబైల్‌ ఫోన్ 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌తో అందుబాటులోకి వచ్చింది. దీనిని వినియోగించి ఇష్టమైన హెడ్‌ఫోన్‌లను ఉపయోగించవచ్చు.

10. డ్యూయల్ స్టీరియో స్పీకర్లు: ఈ ఫోన్ డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంటుంది. ఇవి మెరుగైన ఆడియో అనుభవాన్ని అందిస్తాయి.

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News