Oneplus Nord Ce4 Vijayadashami Offer: దసరా ఆఫర్‌.. అమెజాన్‌లో Oneplus Nord CE4 మొబైల్‌పై రూ.23,300 డిస్కౌంట్..

Oneplus Nord Ce4 Vijayadashami Offer: అత్యంత తగ్గింపు ధరతో మంచి వన్ ప్లస్ మొబైల్ కొనుగోలు చేయాలని వారికి ఇది అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. ప్రీమియం ఫీచర్స్‌తో Oneplus Nord CE4 మొబైల్ భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. దీనిపై అదనంగా ఎన్నో రకాల డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Oct 12, 2024, 04:14 PM IST
Oneplus Nord Ce4 Vijayadashami Offer: దసరా ఆఫర్‌.. అమెజాన్‌లో Oneplus Nord CE4 మొబైల్‌పై రూ.23,300 డిస్కౌంట్..

Oneplus Nord Ce4 Vijayadashami Offer: దసరా సందర్భంగా ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులోకి వచ్చాయి. ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన కొన్ని రకాల ఎలక్ట్రిక్ పరికరాలు ఏకంగా 50 శాతం వరకు తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని స్మార్ట్ ఫోన్స్ అయితే అత్యధిక తగ్గింపు ధరతో లభిస్తున్నాయి. 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో కూడిన కొన్ని మొబైల్స్ భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉన్నాయి. ఇటీవల మార్కెట్లోకి లాంచ్ అయినా..Oneplus Nord CE4 స్మార్ట్ ఫోన్ అత్యధిక తగ్గింపు ధరతో పొందవచ్చు. దీంతోపాటు మరింత తగ్గింపు తర్వాత పొందడానికి ఇతర ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. వీటిని వినియోగించి కొనుగోలు చేసే వారు భారీ డిస్కౌంట్ పొందవచ్చు.. 

ప్రస్తుతం మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులోని మొదటి స్టోరేజ్ వేరియంట్ 8GB ర్యామ్, 128 ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది. అయితే ఈ పేస్ మోడల్ పై అమెజాన్ దసరా సందర్భంగా అత్యధిక డిస్కౌంట్ ను అందిస్తుంది. మార్కెట్లో దీని ధర రూ.24,999 కాగా.. ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌లో భాగంగా ఆరు శాతం తగ్గింపుతో కే వలం రూ.23,499కే లభిస్తుంది. ఈ మొబైల్ పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ చూస్తే.. దీనిని కొనుగోలు చేసే క్రమంలో బ్యాంక్ ఆఫ్ బరోడాకు సంబంధించిన క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేస్తే దాదాపు రూ.1,700 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే హెచ్ ఎస్ బిసి క్రెడిట్ కార్డు వినియోగించి బిల్ చెల్లించే వారికి కూడా  రూ.1,700 వరకు తగ్గింపు పొందవచ్చు. ఇవే కాకుండా ఇతర బ్యాంకులకు సంబంధించి ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని వినియోగించి కొనుగోలు చేసే వారికి అత్యధిక తగ్గింపుతో దీనిని సొంతం చేసుకోవచ్చు. 

ఇక ఈ మొబైల్ పై నో కాస్ట్ EMI ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆప్షన్ వినియోగించి మొబైల్ ను కొనుగోలు చేయాలని వారు ముందుగా కొన్ని సెలెక్టెడ్ బ్యాంకు క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే నో కాస్ట్ EMI ఆప్షన్ కూడా పొందవచ్చు. తప్పకుండా మొబైల్ పై అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ను వినియోగించి కొనుగోలు చేసే వారికి భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఎక్స్చేంజ్ ఆఫర్స్ వినియోగించి కొనుగోలు చేసేవారు ముందుగా పాత ఫోన్ ని ఎక్స్చేంజ్ గా ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.23,300 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో అమెజాన్ అందిస్తున్న ఆఫర్స్ అన్నీ పోను కేవలం రూ.1,500 లోపే కొత్త మొబైల్ పొందవచ్చు.

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
MediaTek Dimensity 1050 5G చిప్‌సెట్‌
6.43-అంగుళాల AMOLED డిస్‌ప్లే
90Hz రిఫ్రెష్ రేట్‌ 
Full HD+ రెసల్యూషన్‌
64MP ప్రైమరీ సెన్సార్ కెమెరా
8MP అల్ట్రా-వైడ్ సెన్సార్ కెమెరా
2MP మాక్రో సెన్సార్‌ కెమెరా
5000mAh బ్యాటరీ
65W SuperVOOC Charging సపోర్ట్‌
Android 12 ఆధారంగా OxygenOS 12.1
డ్యుయల్ సిమ్ కార్ట్ సపోర్ట్‌
ఇన్-డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌
5G, 4G LTE, Wi-Fi, Bluetooth, GPS, USB Type-C పోర్ట్
3.5mm హెడ్‌ఫోన్ జాక్‌

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News