Oppo Reno 12 Series: చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఒప్పో ప్రపంచ మార్కెట్లో Oppo Reno12 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. ఇందులో రెండు వేరియంట్లు Reno 12, Reno 12 Pro ఉన్నాయి. ఈ రెండు మోడల్ ఫోన్ల ఫీచర్లు, ధర ఇతర వివరాలు తెలుసుకుందాం.
ఒప్పో అనగానే కెమేరా గుర్తొస్తుంది. అద్భుతమైన కెమేరా అనుభూతిని ఇస్తుంది ఒప్పో కంపెనీ. ఇప్పుడు కెమేరా సామర్ధ్యాన్ని మరింతగా పెంచుతూ రెండు కొత్త వేరియంట్లు లాంచ్ చేసింది. చైనాలో ముందుగా లాంచ్ అయిన Oppo Reno12, Reno 12 Proలు ఇప్పుడు గ్లోబల్ మార్కెట్లో ఎంట్రీ ఇచ్చేశాయి. ఈ ఫోన్ 6.7 ఇంచెస్ పుల్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్ కలిగి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ బ్రైట్నెస్ ఉంటుంది. మరోవైపు మీడియాటెక్ డైమెన్సిటీ 73000 ప్రోసెసర్‌తో ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా ఒప్పో నుంచి Oppo Reno12, Reno 12 Pro లాంచ్ అయ్యాయి. గతంలో చైనాలో లాంచ్ చేసింది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఇక అన్నింటికంటే ముఖ్యంగా ఇందులో 12 జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్‌తో పాటు 12 జీబీ ర్యామ్-512 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఇప్పుడీ ఫోన్ కెమేరా గురించి మాట్లాడుకోవాలి. ఇందులో 50 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కెమేరా ఉంటుంది. ఇది కాకుండా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్‌తో పాటు 50 మెగాపిక్సెల్ టెలీఫోటో లెన్స్ కెమేరా ఉంటుంది. ఇక సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం ఏకంగా 50 మెగాపిక్సెల్ కేమేరా ఇచ్చింది కంపెనీ. ఇందులో స్పేస్ బ్రౌన్, సన్‌సెట్ గోల్డ్, నెబుల్లా సిల్వర్ రంగులున్నాయి.
ఒప్పో రెనో 12 ధర 44,700 రూపాయలుంది. ఇక ఒప్పో రెనో 12 ప్రో ధర 53,700 రూపాయలుగా ఉంది. ఇండియాలో ఎప్పుడు లాంచ్ అనేది ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. కానీ వచ్చే నెలలో ఉండవచ్చని అంచనా ఉంది.
Also read: ITR Filing: గడువులోగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకుంటే ఏమౌతుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook