OPPO Reno 13: ఒప్పో రెనో 13 సిరీస్ కొత్త ఫోన్ వచ్చేసింది. మొట్టమొదటిసారిగా ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్‌తో వస్తోంది. కెమేరా, ర్యామ్పరంగా అద్భుతమైన ఫీచర్లున్నాయి. ఒప్పో రెనో 13, ఒప్పో రెనో 13 ప్రో స్మార్ట్ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్ ఫీచర్లు, ధర వివరాలు తెలుసుకుందాం.
ఒప్పో రెనో 13 సిరీస్ నుంచి ఒప్పో రెనో 13, ఒప్పో రెనో 13 ప్రో లాంచ్ అయ్యాయి. ఈ రెండు ఫోన్లు తొలిసారిగా ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్‌తో రూపొందింది. యాంటీ డస్ట్, యాంటీ వాటర్ రెసిస్టెంట్ ఐపీ 66, ఐపీ 68, ఐపీ 69 రేటింగులతో వచ్చాయి. ఒప్పో రెనో 13 ఫోన్ అనేది 6.59 అంగుళాలతో 1.5 కే ఎమోల్డ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్సెట్తో పనిచేస్తుంది. ఇందులో 50 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమేరాతోనూ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమేరా ఉంటుంది. ఇక బ్యాటరీ విషయానికొస్తే 5600 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో పనిచేస్తుంది. 80 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ 37,999 రూపాయలు కాగా, 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఫోన్ 39,999 రూపాయలుగా ఉంది.
ఇక ఒప్పో రెనో 13 ప్రో ఫోన్ 6.83 ఇంచెస్ క్వాడ్ కర్వ్డ్ ఎమోల్డ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్సెట్తో పనిచేస్తుంది. ఇందులో ట్రిపుల్ కెమేరా సెటప్ ఉంటుంది. ప్రైమరీ కెమేరా 50 మెగాపిక్సెల్, సెల్ఫీ కెమేరా 50 మెగాపిక్సెల్, టెలీఫోటో కెమేరా 50 మెగాపిక్సెల్ ఉన్నాయి. ఇందులో 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర 49,999 రూపాయలు కాగా, 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ధర 54,999 రూపాయలుంది. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లైవ్ ఫోటో, అండర్ వాటర్ ఫోటోగ్రఫీ ఫీచర్లు ఉన్నాయి.
Also read: TTD War: చంద్రబాబు సాక్షిగా టీటీడీ ఛైర్మన్ వర్సెస్ ఈవో ఘర్షణ, నువ్వెంతంటే నువ్వెంత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.