POCO X6, POCO X6 Pro: పోకో నుంచి 5,500mAh బ్యాటరీ సపోర్ట్‌తో మార్కెట్‌లోకి మరో 2 మొబైల్స్‌..

POCO X6, POCO X6 Pro: మార్కెట్‌లోకి త్వరలోనే POCO X6, POCO X6 Pro స్మార్ట్ ఫోన్స్‌ విడుదల కాబోతున్నాయి. అయితే ఇప్పటికీ ఈ మొబైల్స్‌కి సంబంధించి ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే అతి త్వరలోనే విడుదల చేసే ఛాన్స్‌లు ఉన్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 11, 2024, 05:30 PM IST
POCO X6, POCO X6 Pro: పోకో నుంచి 5,500mAh బ్యాటరీ సపోర్ట్‌తో మార్కెట్‌లోకి మరో 2 మొబైల్స్‌..

 

POCO X6, POCO X6 Pro: మార్కెట్లో గేమింగ్ స్మార్ట్ ఫోన్లు ప్రత్యేక డిమాండ్ ఉంది. ముఖ్యంగా అతి తక్కువ ధరలోనే లభించే గేమింగ్ మొబైల్స్ కి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇలాంటి ఫోన్స్ లో పోకోకు సంబంధించిన స్మార్ట్ ఫోన్లే అధికం. ప్రముఖ టెక్ బ్రాండ్ పోకో అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్ తో కూడిన స్మార్ట్ ఫోన్లను విక్రయిస్తూ ఉంటుంది. అందుకే ప్రస్తుతం యువత ఈ బ్రాండ్ కు సంబంధించిన స్మార్ట్ ఫోన్లను ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని పోకో కంపెనీ అతి త్వరలోనే మరో రెండు స్మార్ట్ ఫోన్ లను విడుదల చేయబోతోంది..అయితే ఆ మొబైల్స్ ఏంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం...

పోకు విడుదల చేయబోయే స్మార్ట్ ఫోన్ లను  POCO X6, POCO X6 Pro పేర్లతో కస్టమర్స్‌కి అందించబోతోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్స్‌కి సంబంధించిన వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా వివరించలేదు. కానీ ఇటీవలే FCC సర్టిఫికేషన్ వెబ్సైట్‌లో మాత్రం ఈ మొబైల్స్‌కి సంబంధించిన వివరాలను పేర్కొన్నారు. ఈ మొబైల్స్‌ మోడల్ నంబర్ 2311DRK48G పేరుతో విడుదల కాబోతోంది. ఈ స్మార్ట్‌ ఫోన్స్‌ 'G' అనే గ్లోబల్ వేరియంట్‌లో రాబోతున్నట్లు FCC జాబితాలో పేర్కొన్నారు. ముందుగా ఈ స్మార్ట్‌ ఫోన్స్‌ 8GB RAM + 256GB,  12GB RAM + 512GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

 

ఈ POCO X6, POCO X6 Pro మొబైల్స్‌ 5G సామర్థ్యంతో NFC సపోర్ట్‌, అన్ని రకాల కనెక్టివిటీ ఫీచర్స్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ రెండు వేరియంట్స్‌ Xiaomi HyperOS 1.0 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేయనున్నాయి. FCC సర్టిఫికేషన్‌లో అందించిన వివరాల ప్రకారం..ఈ మొబైల్‌ 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ని కలిగి ఉంటుంది. దీంతో పాటు  బ్యాటరీ రీప్లెనిష్‌మెంట్‌ ఫీచర్‌ను కూడా అందిస్తోంది. ఇక POCO X6 Pro 5G స్మార్ట్‌ ఫోన్‌ను కంపెనీ రీబ్రాండెడ్ వెర్షన్‌గా విడుదల చేసే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. 

స్పెసిఫికేషన్స్‌ వివరాలు:
ఈ POCO X6, POCO X6 Pro స్మార్ట్‌ఫోన్‌ 6.67-అంగుళాల 1.5K OLED డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. గరిష్ట ఈ డిస్‌ప్లే 1,800 nits వరకు బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఇక ఈ మొబైల్స్‌ MediaTek డైమెన్సిటీ 8300 Ultra SoC చిప్‌సెట్‌పై రన్‌ కాబోతున్నాయి. ఈ మొబైల్స్‌ 64MP OIS ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 2MP మాక్రో కెమెరా ఇలా ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటాయి. వీడియో కాలింగ్‌ కోసం 6MP ఫ్రంట్ కెమెరాతో రాబోతోంది. దీంతో పాటు 5,500mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ వైర్డు ఛార్జింగ్ టెక్నాలజీతో రాబోతోంది. 

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News