Best SUV Nissan Magnite buy only Rs 6 Lakhs: మీరు కొత్త కారును కొనుగోలు చేయాలనుకుంటే.. భారతదేశపు చౌకైన ఎస్‌యూవీని ప్లాన్ చేసుకోవచ్చు. అవును.. ఈ ఎస్‌యూవీ రూ. 6 లక్షలలో కూడా వస్తుంది. ఈ ఎస్‌యూవీ ప్రారంభ శ్రేణి 6 లక్షలలో అందుబాటులో ఉంది. ఆ కారు మరేదో కాదు 'నిస్సాన్ మాగ్నైట్' (Nissan Magnite). రెనాల్ట్ కిగర్, టాటా పంచ్ కాకుండా.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మారుతి బ్రెజా, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ వంటి కార్లతో స్సాన్ మాగ్నైట్ పోటీపడుతుంది. నిస్సాన్ మాగ్నైట్‌ను మీరు ఎందుకు కొనాలి?, ఈ కారు విశేషాల గురించి తెలుసుకుందాం.
నిస్సాన్ మాగ్నైట్ 1 లీటర్ పెట్రోల్ మరియు 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లో వస్తుంది. ఇందులో 100PS పవర్ మరియు 160 Nm పికప్ టార్క్ ఉత్పత్తి అవుతుంది. ఈ ఎస్‌యూవీ కారు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలను కలిగి ఉంది. 5 సీట్ ఎస్‌యూవీ నిస్సాన్ మాగ్నైట్ లుక్ మరియు డిజైన్ అద్భుతమైనదిగా ఉంటుంది. ఈ కారులో 16-అంగుళాల డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ అమర్చబడి ఉంటాయి.
నిస్సాన్ మాగ్నైట్ ఫీచర్లు:
# స్మార్ట్ఫోన్ కనెక్టివిటీ
# ఆటోమేటిక్ ఏసీ
# వైర్లెస్ ఛార్జర్
# గాలిని శుబ్రపరిచే మెషిన్
# సరౌండింగ్ లైటింగ్
# డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు
# బ్యాక్ పార్కింగ్ సెన్సార్
3 హిల్ స్టార్ట్ అసిస్ట్
# 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
# మైలేజ్ 20.0 kmpl
నిస్సాన్ మాగ్నైట్ ధరలు:
# నిస్సాన్ మాగ్నైట్ XE మాన్యువల్ వేరియంట్ ధర రూ.6 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
# నిస్సాన్ మాగ్నైట్ XL మాన్యువల్ వేరియంట్ ధర రూ. 6.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
# నిస్సాన్ మాగ్నైట్ XV మాన్యువల్ వేరియంట్ ధర రూ. 7.76 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
# నిస్సాన్ మాగ్నైట్ XV రెడ్ ఎడిషన్ మాన్యువల్ వేరియంట్ ధర రూ. 7.87 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
# నిస్సాన్ మాగ్నైట్ XV DT మాన్యువల్ వేరియంట్ ధర రూ. 7.92 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
# నిస్సాన్ మాగ్నైట్ టర్బో XL మాన్యువల్ వేరియంట్ ధర రూ. 8.19 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
# నిస్సాన్ మాగ్నైట్ XV ప్రీమియమ్ మాన్యువల్ వేరియంట్ ధర రూ. 8.53 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
Also Read: IND vs AUS: ఆస్ట్రేలియాకు భారీ షాక్.. రెండో టెస్టుకు స్టార్ ఓపెనర్ దూరం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.