Realme GT 7 Pro: భారతీయ మార్కెట్‌లో త్వరలో Realme GT 7 Pro లాంచ్ కానుంది. కొత్త కొత్త ఫీచర్లతో ఎప్పటికప్పుడు కొత్త మోడల్ ఫోన్లు లాంచ్ చేస్తూ మార్కెట్‌లో వాటా పెంచుకుంటోంది. బడ్జెట్ ధరకే అంటే అందరికీ అందుబాటు ధరకే ప్రీమియం ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్లు కావడంతో రియల్ మికు క్రేజ్ పెరిగింది.
Realme GT 7 Pro స్మార్ట్‌ఫోన్ 6.78 ఇంచెస్ ఎల్పీటీవో ఓఎల్ఈడీ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఇందులో 1.5కే రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తోంది. ఇందులో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది. 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. యాంటీ డస్ట్, యాంటీ వాటర్ రెసిస్టెన్స్‌కు సంబంధించి ఐపీ 68 రేటింగ్ కలిగి ఉండటం ఈ ఫోన్ ప్రత్యేకత. ఈ ఫోన్‌లో 16 జీబీ ర్యామ్, 1 టీబీ స్టోరేజ్ ఉంటుంది. ర్యామ్ 16 జీబీ కావడంతో ఫోన్ చాలా వేగంగా పనిచేస్తుంది. ఇక ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ ప్రోసెసర్ కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా పనిచేస్తుంది.
Realme GT 7 Pro ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమేరా ఉంటుంది. మరో 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలీ కెమేరా, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ లేదా వీడియో కెమేరా ఉంటుంది. సెక్యూరిటీ కోసం అల్ట్రా సోనిక్ ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరో ప్రత్యేకత. ఈ ఫోన్ కేవలం 8.5 మిల్లీమీటర్ల మందంతో ఉంటుంది. ఈ ఫోన్ త్వరలోనే ఇండియాలో లాంచ్ కావచ్చు. ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో విడుదల కావచ్చని అంచనా ఉంది.
Also read: 7th Pay Commission DA Hike: ఉద్యోగులకు దసరా కానుక, అక్టోబర్ 9న డీఏ పెంపు ప్రకటన, ఎంతంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.