Redmi Note 13 Pro Olive Green Color Variant: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ Xiaomi మార్కెట్‌లోకి మరో కొత్త మొబైల్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది అతి శక్తివంతమైన ఫీచర్స్‌తో విడుదల కాబోతోంది. ఈ కంపెనీ Redmi Note 13 సిరీస్‌లో కొత్త వేరియంట్ లాంచ్ చేసింది. అయితే జనవరి 2024లో ఈ మొబైల్ మూడు కలర్ వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే కంపెనీ ఈ రెడ్‌మి నోట్ 13 ప్రో స్మార్ట్‌ఫోన్‌నే కొత్త ఆలివ్ గ్రీన్ కలర్ వేరియంట్‌లో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌కి మార్కెట్‌లో మంచి డిమాండ్ లభించింది. ఈ మొబైల్‌కు సంబంధించిన మొదటి సేల్‌లో లక్షలకు పైగా స్మార్ట్‌ఫోన్స్‌ను కంపెనీ విక్రయించింది. ఈ రెడ్‌మి నోట్ 13 ప్రో స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రెడ్‌మి నోట్ 13 ప్రో స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన కొత్త గ్రీన్ కలర్ వేరియంట్ మలేషియాలో మాత్రమే కంపెనీ వెల్లడించింది. అయితే దీనిని తర్వాతలోనేయ గ్లోబల్ లాంచింగ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కొత్త కలర్ స్మార్ట్‌ఫోన్ ధర వివరాల్లోకి వెళితే, దీనిని కంపెనీ రూ. 33,330తో అందుబాటులోకి తీసుకు వచ్చింది. అయితే ఈ ధర ప్రాంతాన్ని బట్టి మారే ఛాన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే, దీనిని కంపెనీ గతంలో లాంచ్ చేసిన Redmi Note 13 సిరీస్ దగ్గర ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది.
Redmi Note 13 Pro స్పెసిఫికేషన్స్:
ఈ Redmi Note 13 Pro స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన కొత్త కలర్ ఫీచర్స్ వివరాల్లోకి వెళితే, ఇది 6.67-అంగుళాల డిస్ల్పేను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఇది FHD+ 120Hz AMOLED డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. ఈ స్క్రీన్ 1800 nits పీక్ బ్రైట్‌నెస్‌ని సెటప్‌తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన Qualcomm Snapdragon 7s Gen 2 SoC చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. అలాగే ఇది 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా దీని బ్యాక్ సెటప్‌లో ఎంతో శక్తివంతమైన 200MP ప్రైమరీ కెమెరాను కూడా కలిగి ఉంటుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ఇతర ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్ కెమెరా
2MP మాక్రో కెమెరా
LED ఫ్లాష్
67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
5,000mAh బ్యాటరీ
ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్
3.5mm ఆడియో జాక్
Dolby Atmos
ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్
USB టైప్-సి పోర్ట్
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి