Republic Day Sale Mobile Offers: రిపబ్లిక్‌ డే ఆఫర్స్‌.. Redmi 13C, OnePlus 12, iQOO 12 మొబైల్‌పై భారీ డిస్కౌంట్‌..

Republic Day Sale Mobile Offers: గణతంత్ర దినోత్సవం సందర్భంగా అమెజాన్‌ అందిస్తున్న ప్రత్యేక సేల్‌లో కొన్ని స్మార్ట్ ఫోన్స్‌ భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 26, 2024, 09:58 AM IST
Republic Day Sale Mobile Offers: రిపబ్లిక్‌ డే ఆఫర్స్‌.. Redmi 13C, OnePlus 12, iQOO 12 మొబైల్‌పై భారీ డిస్కౌంట్‌..

 

Republic Day Sale Mobile Offers: గణతంత్ర దినోత్సవం సందర్భంగా అన్ని ఈ కామర్స్‌ వెబ్‌సైట్స్‌లో ఎలక్ట్రిక్‌ వస్తువుపై డిస్కౌంట్స్‌ ఆఫర్స్‌ను అందిస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్‌లో గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌ కూడా ప్రారంభమైంది. ఈ సేల్‌లో భాగంగా ఎలక్ట్రిక్‌ వస్తువులపై డిస్కౌంట్స్‌ లభించడమే కాకుండా అన్ని రకాల స్మార్ట్‌ ఫోన్స్‌ భారీ తగ్గింపుతో అమెజాన్‌ విక్రయిస్తోంది. ఈ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా OnePlus నుంచి Samsung వరకు అన్ని రకాల ప్రీమియం బ్రాండ్స్‌పై దాదాపు 30 నుంచి 40 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. అయితే ఈ సేల్‌లో ఏయే స్మార్ట్‌ ఫోన్‌పై ఎంతెంత డిస్కౌంట్‌ లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.     

Redmi 13C: 
గణతంత్ర దినోత్సవం సందర్భంగా అమెజాన్‌ నిర్వహిస్తున్న ప్రత్యేక సేల్‌లో భాగంగా ప్రముఖ Xiaomi Redmiకి సంబంధించిన Redmi 13C స్మార్ట్‌ ఫోన్‌పై భారీ తగ్గింపును అందిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై భారీ తగ్గింపు పొందడానికి బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ మొబైల్‌ 50MP AI ట్రిపుల్ కెమెరా సెటప్‌, 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. అయితే దీని అసలు ధర MRP రూ.8,999 కాగా ప్రత్యేక తగ్గింపుతో కేవలం ఈ మొబైల్‌ రూ.7,999తో లభిస్తోంది. 

OnePlus 12:
ప్రీమియం టెక్‌ బ్రాండ్‌ OnePlus 12 స్మార్ట్‌ ఫోన్‌పై కూడా అమెజాన్‌ భారీ తగ్గింపును అందిస్తోంది. ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా ఈ మొబైల్‌పై దాదాపు రూ.2,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ మొబైల్‌ అసలు ధర MRP రూ.64,999 కాగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ మొబైల్‌ కేవలం రూ.62,999కే లభిస్తోంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ను కంపెనీ  Qualcomm  అత్యంత శక్తివంతమైన ప్రాసెసర్ Snapdragon 8 Gen 3 ప్రాసెసర్‌తో అందిస్తోంది.

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

iQOO 12:
అమెజాన్‌లోని ప్రత్యేక సేల్‌లో భాగంగా iQOO 12 స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చు. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా పొందవచ్చు. అయితే ఈ మొబైల్‌ అసలు ధర రూ.59,999కాగా ప్రత్యేక సేల్‌లో భాగంగా కేవలం రూ.49,999లకే లభిస్తోంది. అంతేకాకుండా మరిన్ని ప్లాట్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది.  ఈ మొబైల్‌ 120W FlashCharge సపోర్ట్‌, సూపర్ కంప్యూటింగ్ చిప్ Q1తో అందుబాటులోకి వచ్చింది.

Realme Narzo 60x:
Amazon అదింస్తున్న ప్రత్యేక సేల్‌లో భాగంగా సేల్ Realme Narzo 60x స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చు. అమెజాన్‌లో ఈ మొబైల్‌ అసలు ధర  రూ.14,999 కాగా ప్రత్యేక సేల్‌లో భాగంగా  రూ. 10,999లకే లభిస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌ ప్రీమియం  33W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. 

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News