Samsung Galaxy A55 Price: డెడ్‌ చీప్ ధరకే AMOLED డిస్‌ప్లే సాంసంగ్‌ Galaxy A55 5G మొబైల్‌.. పూర్తి వివరాలు!

Samsung Galaxy A55 Price Cut: ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన Galaxy A55 5G మొబైల్‌పై అమెజాన్‌లో ప్రత్యేకమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌ నడుస్తున్నాయి. ప్రత్యేకమైన డిస్కౌంట్‌తో పాటు ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న ఆఫర్స్‌ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 29, 2024, 04:00 PM IST
Samsung Galaxy A55 Price: డెడ్‌ చీప్ ధరకే AMOLED డిస్‌ప్లే సాంసంగ్‌ Galaxy A55 5G మొబైల్‌.. పూర్తి వివరాలు!

 

Samsung Galaxy A55 Price Cut: ప్రముఖ దక్షిణ కొరియా బ్రాండ్‌ సాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్స్‌ భారతీయ మార్కెట్‌లో దూసుకుపోతున్నాయి. అతి తక్కువ ధరల్లోనే లభించడంతో చాలా మంది ఈ మొబైల్‌ను కొనుగోలు చేస్తున్నారు. అయితే మీరు కూడా ఎప్పటి నుంచో మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన కొన్ని సాంసంగ్‌ మొబైల్స్‌ అతి చౌక ధరల్లోనే లభిస్తున్నాయి. అదనంగా బ్యాంక్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. గతంలో మార్కెట్‌లోకి లాంచ్‌ అయిన 32MP సెల్ఫీ కెమెరా కలిగిన Galaxy A55 5G మొబైల్‌ను ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌లో కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభిస్తోంది. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఫీచర్స్‌ ఏంటో, స్పెషిఫికేషన్‌ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఆఫర్స్‌ పూర్తి వివరాలు:
ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో గెలాక్సీ A55 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేవారికి ప్రత్యేకమైన డిస్కౌంట్‌ ఆఫర్‌ లభిస్తోంది. టాప్ వేరియంట్‌పై దాదాపు రూ.3,000 వరకు తగ్గింపు లభించడమే కాకుండా ఎక్చేంజ్‌ బోనస్‌ కూడా అందుబాటులో ఉంది. ప్రస్తుతం దీని ధర రూ. 45,999 కాగా ప్రత్యేకమైన డీల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి కేవలం రూ.42,999కే లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా తగ్గింపు పొందాలనుకునేవారు HDFC బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లను వినియోగించి బిల్‌ చెల్లిస్తే భారీ తగ్గింపు కూడా లభిస్తుంది. 

ఇక ఈ మొబైల్‌కి సంబంధించిన బేస్‌ వేరియంట్‌ వివరాల్లోకి వెళితే, దీని ధర రూ.39,999లతో లభిస్తోంది. ఇక బ్యాంక్ తగ్గింపు, ఇతర ఆఫర్స్‌ అన్ని పోను దీనిని కేవలం రూ.36,999కే పొందవచ్చు. అంతేకాకుండా అదనంగా ఎక్చేంజ్ ఆఫర్‌ కూడా లభిస్తోంది. దీనిని వినియోగించి బిల్‌ చెల్లిస్తే భారీ తగ్గింపుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను పొందవచ్చు. అయితే ఈ తగ్గింపు అనేది ఎక్చేంజ్‌ చేసే పాత స్మార్ట్‌ఫోన్‌ కండీషన్‌పై ఆధారపడి ఉంటుంది. కండీషన్‌ బాగుంటే భారీ తగ్గింపు లభిస్తుంది. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
50MP ప్రైమరీ లెన్స్‌ ప్రధాన కెమెరా
5MP మాక్రో లెన్స్ కెమెరా
AI ఆధారిత ఫోటోగ్రఫీ ఫీచర్‌
12MP అల్ట్రా-వైడ్ కెమెరా 
32MP సెల్ఫీ కెమెరా 
రిమూవ్ రిఫ్లెక్షన్ ఫీచర్స్‌
6.6-అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లే
120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్
గొరిల్లా గ్లాస్ విక్టస్+ ప్రొటెక్షన్‌
Exynos 1480 ప్రాసెసర్‌
25W ఛార్జింగ్‌ సపోర్ట్‌
5000mAh కెపాసిటీ బ్యాటరీ
32MP సెల్ఫీ కెమెరా 
IP67 రేటింగ్ 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News