Samsung Galaxy M34 5G: తక్కువ ధరలోనే మిడ్‌లెవెల్ సెగ్మెంట్ ఫీచర్స్ ఉన్న ఫోన్

Samsung Galaxy M34 5G Phone In India: స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి శాంసంగ్ గెలాక్సీ నుంచి మరో కొత్త ఫోన్ లాంచ్ అయింది. శాంసంగ్ గెలాక్సీ M34 5G పేరిట రానున్న ఈ ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాలు ఫోన్ లాంచింగ్ కంటే ముందుగానే లీక్ అయిన సంగతి తెలిసిందే.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 8, 2023, 09:35 AM IST
Samsung Galaxy M34 5G: తక్కువ ధరలోనే మిడ్‌లెవెల్ సెగ్మెంట్ ఫీచర్స్ ఉన్న ఫోన్

Samsung Galaxy M34 5G Phone In India: స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి శాంసంగ్ గెలాక్సీ నుంచి మరో కొత్త ఫోన్ లాంచ్ అయింది. శాంసంగ్ గెలాక్సీ M34 5G పేరిట రానున్న ఈ ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాలు ఫోన్ లాంచింగ్ కంటే ముందుగానే లీక్ అయిన సంగతి తెలిసిందే. జూలై 7న లాంచ్ అయిన ఈ ఫోన్ ఖరీదు కూడా తక్కువగానే ఉంది. అవును కేవలం రూ. 16,999 కే శాంసంగ్ గెలాక్సీ M34 5G బేస్ వేరియంట్ ఫోన్ లభిస్తోంది.  

లో లైట్‌లోనూ క్రిష్టల్ క్లియర్ ఫోటోలు, వీడియోలు తీసుకునేలా 50MP కెమెరా, 6.6 అంగుళాల స్క్రీన్‌తో, 120Hz రిఫ్రెష్ రేటుతో సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తున్న ఈ ఫోన్‌కి 6000 mAh బ్యాటరీని అమర్చారు. ఈ మొబైల్‌తో 25W ఫాస్ట్ చార్జర్ లభిస్తోంది. ఒకరకంగా ఈ రోజుల్లో ఇంకా 25W చార్జర్ మాత్రమే అందిస్తుండం ఒక మైనస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. ఇందులో బేస్ మోడల్ 6GB RAM ప్లస్ 128GB స్టోరేజ్ ఫోన్ కాగా 8GB RAM ప్లస్ 128GB స్టోరేజ్ వేరియంట్ ఫోన్ టాప్ ఎండ్ వేరియంట్‌గా ఉంది. 

ఈ ఆగస్టు, సెప్టెంబర్ నుంచి ఫెస్టివల్స్ సీజన్ రానుండటంతో ఈ ఫెస్టివల్ సీజన్‌ని లక్ష్యంగా చేసుకుని శాంసంగ్ ఈ మిడ్ లెవెల్ 5G స్మార్ట్ ఫోన్‌ని ఇండియాకి పరిచయం చేసింది అనే అనుకోవచ్చు. అంతేకాదు... ఈ మీడియం సెగ్మెంట్‌లో ప్రీమియం ఫీచర్స్‌తో వస్తోన్న ఫోన్ కావడంతో యువత ఈ ఫోన్ పట్ల ఎక్కువ మక్కువ చూపించే అవకాశాలు ఉన్నాయని శాంసంగ్ కంపెనీ చెబుతోంది.
 
ఈ మొబైల్ కెమెరాతో ట్రావెలింగ్‌లోనూ పర్‌ఫెక్ట్ వీడియోలు తీసుకోవచ్చు అని శాంసంగ్ వెల్లడించింది. 2019లో శాంసంగ్ గెలాక్సీ M సిరీస్ లాంచ్ అయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సిరీస్‌లో ఎన్నో ఫోన్స్ మార్కెట్లోకి రాగా అందులో ఎక్కువ శాతం ఫోన్లు కొవిడ్ -19 కాలంలోనే పిల్లల ఆన్‌లైన్ క్లాసెస్ ఇతరత్రా అవసరాలకే అమ్ముడయ్యాయి. శాంసంగ్ స్మార్ట్ ఫోన్ల అమ్మకాల్లో శాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్ ఫోన్స్ వాటానే అధిక భాగంలో ఉండటం విశేషం.

Trending News