Samsung Galaxy M34 5G Price: ప్రత్యేక డీల్ సందర్భంగా..అమెజాన్‌లో Samsung Galaxy M34 5Gను రూ.1,099కే పొందండి!

Samsung Galaxy M34 5G Price In India: ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌లో అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయంగా భావించవచ్చు. సాంసంగ్‌ కంపెనీ Galaxy M34 5G మొబైల్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు లభిస్తుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 16, 2023, 02:35 PM IST
Samsung Galaxy M34 5G Price: ప్రత్యేక డీల్ సందర్భంగా..అమెజాన్‌లో Samsung Galaxy M34 5Gను రూ.1,099కే పొందండి!

 

Samsung Galaxy M34 5G Price In India: దక్షిణ కొరియాణ్‌ టెక్ కంపెనీ సాంసంగ్‌ (Samsung)కి భారత్‌లో మంచి గుర్తుంపు లభించింది. ప్రీమియం డిజైన్ కలిగిన సరికొత్త మొబైల్స్‌ అతి తక్కువ ధరకే లభిస్తున్నాయి. అతి తక్కువ ధరలోనే మంచి స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. అమెజాన్‌లోని 5జీ స్మార్ట్ ఫోన్స్‌ను కొనుగోలు చేయాలనుకునేవారు రూ.20,000లోపే పొందవచ్చు. అయితే అమెజాన్‌లో జరిగే ప్రత్యేక సేల్‌లో భాగంగా ఏయే స్మార్ట్ ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్‌ లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ప్రస్తుతం ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌లో M-సిరీస్ Galaxy M34 5G స్మార్ట్‌ఫోన్‌ గరిష్టంగా 12GB ర్యామ్‌తో రాబోతోంది. ఈ మొబైల్‌ ఫోన్‌ హై క్వాలిటీ డిస్ప్లే, బ్యాటరీని కలిగి ఉంటాయి. దీంతో పాటు సరికొత్త Android 13తో ఈ మొబైల్‌ ఫోన్‌ 5 సంవత్సరాల పాటు 4 ప్రధాన Android అప్‌డేట్‌లను కలిగి ఉంటుంది. సెక్యూరిటీ అప్‌డేట్‌ల కోసం చాలా రకాల ఫీచర్స్‌తో రాబోతోంది. 

Galaxy M34 5G డిస్కౌంట్‌:
ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్‌లో Galaxy M34 5G మొబైల్‌ అందుబాటులో ఉంది. 6GB ఇన్‌స్టాల్ చేసిన ర్యామ్‌,  128GB స్టోరేజ్‌తో లభిస్తోంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ బేస్ మోడల్ ధర రూ.24,499గా లభిస్తోంది. అయితే ఈ మొబైల్‌ ప్రత్యేక డీల్‌లో భాగంగా  18% తగ్గింపుతో రూ.19,999కే అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ను OneCard క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేసి బిల్‌ చెల్లిస్తే భారీ తగ్గింపు లభిస్తుంది.

Also Read: Viral News: మృతదేహం నీటిలో ఎందుకు మునిగిపోదో తెలుసా? తప్పక తెలుకోవాల్సిన ఆసక్తికర విషయం!

ఎక్చేంజ్‌ ఆఫర్:
ఈ స్మార్ట్‌ ఫోన్‌పై అమెజాన్‌ ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. మీరు ఈ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే గరిష్టంగా రూ.18,900 వరకు బోనస్‌ లభిస్తుంది. అయితే ఈ బోనస్‌ అనేది మీరు ఎక్చేంజ్‌ చేసే పాత మొబైల్‌పై ఆధారపడి ఉంటుంది. పాత మొబైల్‌ కండీషన్‌ బాగుంటేనే దాదాపు పై డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ స్మార్ట్ ఫోన్‌ రూ.1,099కే పొందవచ్చు. అంతేకాకుండా ఈ Galaxy M34 5G మొబైల్‌పై నో కాస్ట్‌ EMI ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంది. 

Galaxy M34 5G స్పెసిఫికేషన్‌లు:
 6.5 అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లే
HD + రిజల్యూషన్
గొరిల్లా గ్లాస్ 5 ప్రొటక్షన్‌
50MP+8MP+2MP ట్రిపుల్ కెమెరా సెటప్
3MPసెల్ఫీ కెమెరా
Exynos 1290 ప్రాసెసర్‌
6000mAh బ్యాటరీ
ఛార్జింగ్ అడాప్టర్ 
25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌

Also Read: Viral News: మృతదేహం నీటిలో ఎందుకు మునిగిపోదో తెలుసా? తప్పక తెలుకోవాల్సిన ఆసక్తికర విషయం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News