Samsung Galaxy S23 Ultra 5G Price: దీవాళి ప్రత్యేక ఆఫర్‌..Samsung Galaxy S23 Ultra 5G మొబైల్‌ను రూ.57,999కే పొందండి!

Samsung Galaxy S23 Ultra 5G Price: అతి తక్కువ ధరలోనే 200 మెగాపిక్సెల్ కెమెరా కలిగిన Samsung Galaxy S23 Ultra 5G మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావింవచ్చు. ఫ్లిఫ్‌కార్ట్‌లోని దీవాళి ప్రత్యేక సేల్‌లో భాగంగా 33 శాతం తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 11, 2023, 01:42 PM IST
Samsung Galaxy S23 Ultra 5G Price: దీవాళి ప్రత్యేక ఆఫర్‌..Samsung Galaxy S23 Ultra 5G మొబైల్‌ను రూ.57,999కే పొందండి!

 

Samsung Galaxy S23 Ultra 5G Price: 200 మెగాపిక్సెల్ కెమెరాతో కూడిన 5జీ స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా అన్ని స్మార్ట్ ఫోన్స్‌ భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి. 200 మెగాపిక్సెల్ కెమెరా కలిగిన Samsung Galaxy S23 Ultra 5G స్మార్ట్‌ ఫోన్‌పై ప్రత్యేక డీల్‌ నడుస్తోంది. ఈ డీల్‌లో భాగంగా రూ.92,000 కంటే మరింత తగ్గింపుకే పొందవచ్చు. అంతేకాకుండా ఈ మొబైల్‌పై ఫ్లిఫ్‌కార్ట్‌ బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. వీటిని వినియోగించి కొనుగోలు చేస్తే మరింత తగ్గింపుతో పొందవచ్చు. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై లభిస్తున్న ఆఫర్స్‌ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ప్రస్తుతం ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ Samsung Galaxy S23 Ultra 5G స్మార్ట్ ఫోన్‌ అందుబాటులో ఉంది. ఈ మొబైల్‌ MRP రూ.1,49,999తో విక్రయిస్తోంది. అయితే బిగ్ దివాళీ సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్‌పై 33 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ మొబైల్‌ను రూ.32,000 తగ్గింపుతో రూ.99,999కే పొందవచ్చు. దీంతో పాటు ఈ మొబైల్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని వినియోగించి కొనుగోలు చేస్తే మరింత తగ్గింపు పొందవచ్చు. 

బ్యాంక్‌ ఆఫర్స్‌:
ఈ Galaxy S23 Ultra 5G స్మార్ట్ ఫోన్‌ను అదనపు తగ్గింపుతో పొందడానికి బ్యాంక్‌ ఆఫర్స్‌ను వినియోగించాల్సి ఉంటుంది. మీరు ఈ మొబైల్‌ను కొనుగోలు చేసే క్రమంలో సాంసంగ్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు 10 శాతం తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి కూడా 5 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. ఇక ఈ మొబైల్‌ కొనుగోలు చేసిన తర్వాత బ్యాక్‌ కవర్స్‌ను కొనుగోలు చేసేవారికి వాటిపై ఫ్లిఫ్‌కార్డ్‌ అదనంగా 10 శాతం తగ్గింపును అందిస్తోంది. 

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

ఎక్చేంజ్‌ ఆఫర్‌:
బిగ్‌ దీవాళి సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ ఫోన్‌పై ఫ్లిఫ్‌కార్ట్‌ ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. మీరు ఈ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చు. అయితే ఈ ఆఫర్స్‌లో భాగంగా మీ పాత బ్రాండెడ్‌ స్మార్ట్ ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ ఎక్చేంజ్‌ చేస్తే దాదాపు రూ.42,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ లభిస్తుంది. దీంతో మీరు ఈ స్మార్ట్‌ ఫోన్‌ను రూ.57,999కే పొందవచ్చు. ఈ ప్రత్యేకమైన ఆఫర్‌ రేపటితో ముగియబోతోంది. 

ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
6.8 అంగుళాల AMOLED డిస్ప్లే
QHD+ రిజల్యూషన్‌
120Hz రిఫ్రెష్ రేట్‌
అడ్రినో 740 GPU
ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్
200MP బ్యాక్‌ కెమెరా
200-మెగాపిక్సెల్ ISOCELL HP2 సెన్సార్ కెమెరా
10-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా 
10-మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్‌ కెమెరా 
45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌
10W Qi వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌
5000 mAh బ్యాటరీ
ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్

(నోట్‌: మేము ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లలో అందించే ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు, డిస్కౌంట్‌ల ఆధారంగా ఈ కథనాన్ని రూపొందించాము. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు గాడ్జెట్ పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. దాని ధరను ఖచ్చితంగా తెలుసుకొని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.)

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News