Flipkart Big Diwali Sale: గత కొన్ని రోజులుగా ఫ్లిప్ కార్ట్, అమెజాన్ సంస్థలు తమ యూజర్ల కోసం అనేక రకాల ఆఫర్లు తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా బిగ్ దీపావళి సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమైంది, అలాగే ఈ సేల్ అక్టోబర్ 23 వరకు కొనసాగుతుంది. ఈ సేల్లో స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీలు, అనేక ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై గొప్ప డిస్కౌంట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మీరు మీ కోసం ఒక కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే, మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఉత్తమ శాంసంగ్ ఫోన్ గురించిన సమాచారాన్ని మీకు అందిస్తున్నాము.
తాజాగా ఇ-కామర్స్ సైట్ Flipkart ప్రస్తుతం శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 3 5Gపై భారీ తగ్గింపు అందిస్తోంది. దీంతో ఇప్పుడు మీరు ఈ శాంసంగ్ ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్‌ను భారీ బ్యాంక్ డిస్కౌంట్‌లు, ధర తగ్గింపులు అలాగే ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లతో కొనుగోలు చేయవచ్చు. ధర మొదలైన వాటి నుండి ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్‌ల గురించి వివరంగా తెలుసుకుందాం. శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 3 5G స్మార్ట్‌ఫోన్ సేల్‌లో చాలా చౌకగా కొనుగోలు చేయవచ్చు. 96 వేల ఎంఆర్‌పి ఉన్న ఈ ఫోన్‌ను కేవలం 30 వేల రూపాయలకే మీరు కొనుగోలు చేయవచ్చు.
ఎలాగంటే శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 3 5G ఫోన్ ప్రారంభ ధర రూ. 95,999 అయితే ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడు రూ. 59,999కి అందుబాటులో ఉంది. ఫోన్ పై 36 వేల రూపాయల ఫుల్ డిస్కౌంట్ ఇస్తోంది ఫ్లిప్‌కార్ట్. ఇక 36 వేల ఆ తర్వాత ఫోన్‌పై అనేక బ్యాంక్ సహా ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు ఉన్నాయి, దీని కారణంగా ఫోన్ ధర గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. మీరు కనుక శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 3 5G ని కొనుగోలు చేయడానికి SBI క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే, మీకు 3 వేల రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది.
ఆ తర్వాత ఫోన్ ధర రూ.56,999గా ఉంటుంది. ఆ తర్వాత ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉండడంతో మీ ఫోన్ కనుక మంచి కండిషన్లో ఉంటే శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 3 5Gపై రూ. 26,900 ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంటుంది. మీ పాత ఫోన్ మంచి కండిషన్‌లో ఉండి, మోడల్ సరికొత్తది అయి ఉంటే మీకు రూ.26,900 డిస్కౌంట్ లభిస్తుంది. ఒకవేళ మీరు ఫుల్ ఆఫ్ పొందగలిగితే, మీకు శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 3 5G ఫోన్ రూ. 30,099కే దొరుకుతుందన్న మాట.
Samsung Galaxy z Flip3 5g Specifications: శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 3 5G ఫోన్ 6.7-అంగుళాల ఫుల్ HD + డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8GB RAM అలాగే 128GB స్టోరేజ్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో 12 మెగాపిక్సెల్‌ల ఫస్ట్ కెమెరా, 12 మెగాపిక్సెల్‌ల సెకండ్ కెమెరా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో 10 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఇచ్చారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 3300 mAh లిథియం అయాన్ బ్యాటరీ ఇచ్చారు. Qualcomm Snapdragon 888 octa కోర్ ప్రాసెసర్ ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఇవ్వగా ఆండ్రాయిడ్ 11తో పనిచేస్తుంది.
Also Read: Vivo 5G Software Updates: వివో 5G స్మార్ట్‌ఫోన్స్‌కి సాప్ట్‌వేర్ అప్‌డేట్స్‌పై గుడ్ న్యూస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook