Samsung Galaxy M55: శాంసంగ్ నుంచి కొత్త ఫోన్ గెలాక్సీ ఎం55 త్వరలోనే, లీకైన ఫోటో, ఫీచర్లు

Samsung Galaxy M55 Features Leaked: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం, మొబైల్ ఫోన్ మార్కెట్‌లో అత్యధిక వాటా కలిగి శాంసంగ్ అద్బుతమైన, కళ్లు చెదిరే ఫీచర్లతో మరో ఫోన్ లాంచ్ చేయనుంది. త్వరలోనే ఇండియన్ మార్కెట్‌లో ఎంట్రీ ఇవ్వనున్న ఈ ఫోన్ ఫీచర్లు, ఫోటో లీక్ అయ్యాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 20, 2024, 12:38 PM IST
Samsung Galaxy M55: శాంసంగ్ నుంచి కొత్త ఫోన్ గెలాక్సీ ఎం55 త్వరలోనే, లీకైన ఫోటో, ఫీచర్లు

Samsung Galaxy M55 Features Leaked: Samsung Galaxy M55 5G ఇప్పుడు మార్కెట్‌లో ఈ ఫోన్ గురించే చర్చ నడుస్తోంది. త్వరలో ఇండియాలో ఈ ఫోన్ లాంచ్ కానుంది. అధికారికంగా ప్రకటన విడుదల కాలేదు కానీ ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు బయటికొచ్చాయి. అద్భుతమైన ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్‌తో ఈ ఫోన్ మార్కెట్‌లో సెన్సెషన్ క్రియేట్ చేయవచ్చని అంచనా ఉంది. 

శాంసంగ్ గెలాక్సీ ఎం 55 5జి స్మార్ట్‌ఫోన్ ఫోటో ఒకటి ఎక్స్‌లో వైరల్ అవుతోంది. ఈ ఫోటో ఆధారంగా ఈ ఫోన్ కలర్ ఆప్షన్లు తెలుస్తున్నాయి. ఈ ఫోన్‌లో ట్రిపుల్ కెమేరా సెటప్ ఉంది. బ్లూ, బ్లాక్ కలర్స్‌లో ఈ కొత్త ఫోన్ అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. ఎల్ఈడీ ఫ్లాష్ లైట్ ఆప్షన్ కూడా ఉంది. వాల్యూమ్, పవన్ బటన్ కుడిచేతివైపున్నట్టు కన్పిస్తోంది. శాంసంగ్ అధికారికంగా ఈ ఫోన్ ఫీచర్లపై ఎలాంటి ప్రకటన చేయలేదు కానీ శాంసంగ్ గెలాక్సీ ఎం54 కంటే మించి ఉండవచ్చని అంచనా. 

ఇందులో 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఇక 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది. డ్యూయల్ సిమ్ కార్డు సౌకర్యంతో పాటు వైపై, బ్లూటూత్ వంటి కనెక్టివిటీలను కలిగి ఉంటుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్‌సెట్ ఉంటుంది. 8జీబీ ర్యామ్ కావడంతో ఫోన్ చాలా వేగంగా పనిచేస్తుంది. ఇక కెమేరా విషయంలో ప్రైమరీ కెమేరా ఏకంగా 108 మెగాపిక్సెల్ ఉండవచ్చు. ఇది కాకుండా 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమేరా ఉంటాయి. ఇక సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 32 మెగాపిక్సెల్ కెమేరా ఉండటం ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. 

Samsung Galaxy M54 తరువాతి వెర్షన్ కావడంతో ఫీచర్లు ఇంకాస్త ఎక్కువగా ఉండవచ్చు. ధర కూడా ఇంచుమించుగా కొద్దిగా ఎక్కువ ఉండవచ్చు. 

Also read: Oneplus 12R Sales: 100 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమేరాతో వన్‌ప్లస్ 12ఆర్ అమ్మకాలు ప్రారంభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News