Cheapest Best Mobile: అతి చౌకగా మార్కెట్‌లోకి Tecno Pova 5, Pova 5 Pro మొబైల్స్‌.. ఫీచర్స్‌, ధర వివరాలు ఇవే!

Tecno Pova 5, Pova 5 Pro: Tecno కంపెనీ నుంచి త్వరలోనే మార్కెట్‌లోకి మరో రెండు స్మార్ట్‌ ఫోన్‌లు విడుదల కాబోతున్నాయి. అయితే తక్కువ ధరలో మంచి ఫీచర్లు కలిగిన మొబైల్‌ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారు ఇంకో వారం వేచి ఉండాల్సిందే..

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Aug 12, 2023, 12:46 PM IST
Cheapest Best Mobile: అతి చౌకగా మార్కెట్‌లోకి Tecno Pova 5, Pova 5 Pro మొబైల్స్‌.. ఫీచర్స్‌, ధర వివరాలు ఇవే!

 

Tecno Pova 5, Pova 5 Pro: ప్రముఖ టెక్‌ కంపెనీ Tecno త్వరలోనే మరో రెండు స్మార్ట్‌ ఫోన్‌లను విడుదల చేయబోతోంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని వరల్డ్ ఆఫ్ టెక్నాలజీ ఈవెంట్‌లో శుక్రవారం కంపెనీ వెల్లడించింది. కంపెనీ Tecno Pova 5, Tecno Pove 5 Pro మోడల్స్‌లో ఆగస్టు 14వ తేదిన లాంచ్‌ చేయబోతోంది. ఈ మొబైల్‌ ఫోన్‌లో చాలా రకాల కొత్త ఫీచర్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇక ఫీచర్ల విషయానికొస్తే..ఈ స్మార్ట్‌ ఫోన్‌లు 120Hz రిఫ్రెష్ రేట్‌ సపోర్ట్‌తో FHD+ రిజల్యూషన్‌ 6.78 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మొబైల్‌ బ్యాక్‌ సెట్‌లో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌లు కలిగి ఉండబోతోంది. అయితే ఈ మొబైల్‌ ఫోన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Tecno Pova 5, Pova 5 Pro రెండు మోడల్స్‌ ఆగస్టు 14న లాంచ్ అవ్వబోతున్నాయి. అయితే వీటి ధరలను విడుదల రోజే ప్రకటించబోతున్నట్లు సమాచారం. మొదట ఈ స్మార్ట్‌ ఫోన్‌లను ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతున్నారని అధికారిక సమచారం. ఇక ఈ మొబైల్స్‌ మక్కా బ్లాక్, హరికేన్ బ్లూ, అంబర్ గోల్డ్ కలర్ వేరియంట్స్‌లో లభించనున్నాయి. Pova 5 Pro సిల్వర్ ఫాంటసీ, డార్క్ ఇల్యూజన్ కలర్ ఆప్షన్‌లలో లాంచ్ కాబోతున్నాయి. 

Tecno Pova 5 స్పెసిఫికేషన్‌లు:
❁ 6.78 అంగుళాల HD+ డిస్‌ప్లే
❁ 120Hz రిఫ్రెష్ రేట్ 
❁ 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌
❁ ఆక్టా-కోర్ MediaTek Helio G99 SoC
❁ 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా 
❁ AI లెన్స్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా మాడ్యూల్‌
❁ LED ఫ్లాష్ లైట్‌
❁ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌
❁ డ్యూయల్ 4G VoLTE
❁ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌
❁ 6,000mAh బ్యాటరీని ప్యాక్

Also Read: Child Marriage: రూ.25 వేలకు ఆశపడి కూతురికి బాల్య వివాహం.. ట్విస్ట్ ఇచ్చిన బాలిక..

Tecno Pova 5 Pro స్పెసిఫికేషన్‌లు:
❁ ARC ఇంటర్‌ఫేస్‌
❁ ఆక్టా-కోర్ డైమెన్సిటీ 6080 SoC
❁ Mali-G57 MC2 CPU
❁ ఫ్రంట్ ఫేసింగ్ 16 మెగాపిక్సెల్ సెన్సార్‌ కెమెరా 
❁ 5,000mAh బ్యాటరీ
❁ 68W ఛార్జింగ్ సపోర్ట్‌

Also Read: Child Marriage: రూ.25 వేలకు ఆశపడి కూతురికి బాల్య వివాహం.. ట్విస్ట్ ఇచ్చిన బాలిక..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News