Car Driving Tips: కారు డ్రైవింగ్ ఇలా నేర్చుకోండి.. వారంలో పర్‌ఫెక్ట్ అయిపోతారు..!

How To Learn Car Driving: కారు డ్రైవింగ్ నేర్చుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఈజీ ట్రిక్స్‌తో నేర్చుకుంటే ఒక వారంలో డ్రైవింగ్ పర్‌ఫెక్ట్ కావచ్చు. అనుభవజ్ఞుడైన డ్రైవర్‌కు తోడు మీకు నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే డ్రైవింగ్ ఈజీగా వచ్చేస్తుంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 26, 2024, 12:54 PM IST
Car Driving Tips: కారు డ్రైవింగ్ ఇలా నేర్చుకోండి.. వారంలో పర్‌ఫెక్ట్ అయిపోతారు..!

How To Learn Car Driving: ప్రస్తుతం ఎక్కువ మంది కారు డ్రైవింగ్ నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. డ్రైవింగ్ స్కూల్స్‌లో ఫీజు కట్టేసి నేర్చుకునేందుకు వెళుతున్నారు. మీరు కూడా డ్రైవింగ్ నేర్చుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లయితే కొన్ని ట్రిక్స్ తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటే వారంలోనే మీరు కారు నడపొచ్చు. అనుభవజ్ఞుడైన డ్రైవర్ దగ్గర డ్రైవింగ్ కోసం చేరండి. ఎంత ఎక్కువ సేపు సాధన చేస్తే.. డ్రైవింగ్ అంత పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటారు. ప్రతి రోజూ కనీసం గంటసేపు అయినా డ్రైవింగ్ ప్రాక్టీస్ చేయాలి. డిఫరెంట్ రోడ్లు, ట్రాఫిక్‌లో ప్రాక్టీస్ చేయండి. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఎలా డ్రైవ్ చేయాలి..? ఏ టైమ్‌లో ఎలా గేర్లు మర్చాలి..?  వంటి అన్ని విషయాలపై అవగాహన పెంచుకోండి.

Also Read: Kalki 2898 AD Bookings: కల్కి 2898 AD మూవీ ఫీవర్ మాములుగా లేదుగా.. ఒక్కో టిక్కెట్ ధర ఏకంగా రెండు వేలకు పైగా..!

ముందు బేసిక్స్‌ మాత్రం తప్పకుండా నేర్చుకోండి. స్టీరింగ్, గేర్ షిఫ్టింగ్, బ్రేకింగ్, యాక్సిలరేషన్ వంటి ప్రాథమిక అంశాలలో నైపుణ్యం పెంపొందించుకోండి. రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ రూల్స్, రోడ్డుపై ఉన్న సింబల్స్‌కు అర్థాలు తెలుసుకోండి. హడావుడిగా కారు నేర్చుకోవాలని అనుకోకుండా.. కాస్త నిదానమైనా ఓపికతో నేర్చుకోండి. మీకు అర్థం కాకపోతే వెంటనే నిరుత్సాహానికి గురి కావద్దు. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈజీగా డ్రైవింగ్ వచ్చేస్తుంది. సీటు బెల్ట్ ధరించడం అస్సలు మార్చిపోవద్దు. అద్దాలను సర్దుబాటు చేసుకోండి. వెనుక నుంచి వచ్చే వాహనాలను గమనిస్తూ ఉండండి. స్టీరింగ్ వీల్‌ని సరిగ్గా పట్టుకోండి. ఓవర్ స్పీడ్‌తో వెళ్లకండి. మద్యం సేవించి లేదా డ్రగ్స్ తీసుకుని వాహనం అస్సలు నడపవద్దు. అన్ని పర్‌ఫెక్ట్‌గా నేర్చుకుంటే ఒక వారంలో డ్రైవింగ్ వస్తుంది. కానీ ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది.

ప్రాక్టీస్ చేసేందుకు ఖాళీ ప్రదేశం చూసుకోండి. డ్రైవింగ్ గురించి బాగా తెలిసిన వ్యక్తిని మీ వెంట తీసుకువెళ్లండి. డ్రైవింగ్‌లో మీ ప్రొగ్రెస్ ఎలా ఉందో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. పాజిటివ్ మైండ్‌తో కారు డ్రైవింగ్ నేర్చుకోండి. డ్రైవింగ్ సమయంలో ఇబ్బంది ఎదురైతే కంగారు పడకండి. కూల్‌గా ఉంటూ.. అన్ని టెక్నిక్స్ తెలుసుకోండి. ఏ సమయంలో ఎలా వ్యవహరించాలని సీనియర్ డ్రైవర్లను అడిగి తెలుసుకోండి.

Also Read: SI harassment: బైట పడ్డ మరో ఎస్సై బాగోతం.. చికెన్ వండి కోపరేట్ చేయ్యాలని మహిళకు లైంగిక వేధింపులు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News