Kalki 2898 AD Bookings: కల్కి 2898 AD మూవీ ఫీవర్ మాములుగా లేదుగా.. ఒక్కో టిక్కెట్ ధర ఏకంగా రెండు వేలకు పైగా..!

Kalki 2898 AD Bookings: రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ మాములుగా లేదుగా.. ప్రస్తుతం నార్త్, సౌత్ తేడా లేకుండా ‘కల్కి ’బుకింగ్స్ మాములుగా లేవు. ఒక హిందీ బెల్టులో కూడా ప్రభాస్ క్రేజ్ ఓ రేంజ్ లో ఉంది. అక్కడ ఓ మల్టీప్లెక్స్ లో ఏకంగా భారీ రేటు పెట్టినా.. అభిమానులు అవేమి పట్టించుకోకుండా ఈ సినిమా టికెట్స్ ను బుక్ చేసుకుంటున్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 26, 2024, 01:02 PM IST
Kalki 2898 AD Bookings: కల్కి 2898 AD మూవీ ఫీవర్ మాములుగా లేదుగా.. ఒక్కో టిక్కెట్ ధర ఏకంగా రెండు వేలకు పైగా..!

Kalki 2898 AD Bookings: ఏది ఏమైనా గత కొన్ని రోజులుగా బాక్సాఫీస్ దగ్గర స్తబ్దుగా ఉంది. కానీ ప్రభాస్ ‘కల్కి 2898 AD’ రాకతో బాక్సాఫీస్ దుమ్ము దులుపుతోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో యూఎస్ మార్కెట్ లో ఈ సినిమా దూసుకుపోతుంది. అక్కడ ఇప్పటికే $3 మిలియన్స్ ప్రీమియర్స్ ద్వారా రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రభాస్ ‘కల్కి ’ మూవీ దుమ్ము దులుపుతోంది. మొత్తంగా బుకింగ్స్ ఓపెన్ చేసిన వెంటనే టికెట్స్ అన్ని క్షణాల్లో సేల్ అవుతున్నాయి. తమిళనాడు సహా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ సినిమా బుకింగ్స్ డల్ గా ఉన్నాయి.

కానీ నార్త్ బెల్ట్ లో కూడా కల్కి ఫీవర్ మాములుగా లేదు. అక్కడ కొన్ని మల్టీప్లెక్స్ లలో టికెట్ రేట్స్ భారీగా ఉన్నాయి. అయినా.. ప్రేక్షకులు అవేవి పట్టించుకోకుండా ఈ సినిమా చూసేందుకు ఎగబడుతున్నారు. ముంబైలోని మైసన్ INOX జియో వరల్డ్ ప్లాజాలో ఒక్కో టికెట్ రేట్ రూ. 2300 కు విక్రయిస్తోంది. అంతేకాదు బుకింగ్స్ ఓపెన్ అయిన వెంటనే ఈ టిక్కెట్స్ అన్ని సేల్ అయిపోవడం మరో విశేషం.

మరోవైపు అక్కడ కొన్ని మల్టీప్లెక్స్ లలో రూ. 1560, రూ. 1760 రేట్స్ ఉన్నా.. ప్రేక్షకులు అవేమి పట్టించుకోకుండా.. ప్రభాస్ నటించిన కల్కి సినిమా చూడడానికి థియేటర్స్ కు ఎగబడుతున్నారు. మొత్తంగా హిందీలో ఈ సినిమా దాదాపు రూ. 85 కోట్ల  ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా అక్కడ హిట్ అనిపించుకోవాలంటే.. దాదాపు రూ. 150 కోట్ల నెట్ వసూళ్లను రాబడితే హిట్ అనిపించుకుంటుంది. ఏది ఏమైనా నార్త్, సౌత్ కలయికలో ఎలాంటి హాలీడే లేని టైమ్ లో వస్తోన్న కల్కి మూవీ భారతీయ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.

Also read: Redmi Note 13 Pro: 108MP, 200MP కెమేరా, 12 జీబీ ర్యామ్‌తో రెడ్‌మి నోట్ 13 ప్రో విడుదల, ధర ఎంతంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News