Vivo Y17S: ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో భారత మార్కెట్లోకి మరో కొత్త మొబైల్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. వివో తమ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను Y17s మోడల్‌లో లాంచ్ చేయబోతున్నట్లు తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్ అత్యంత శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా దీనిని "డైమండ్ ఆరెంజ్" పేరుతో కొత్త కలర్ వేరియంట్‌లో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు కంపెనీ యోచిస్తోంది. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలిపింది. అంతేకాకుండా ఇది ఎంతో ఆకర్షణీయమైన డిజైన్‌తో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ ఏంటో, వాటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
టిప్‌స్టర్ పరాస్ గుగ్లానీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ Y17s స్మార్ట్ ఫోన్ మిస్టిక్ గ్రీన్, గ్లిట్టర్ పర్పుల్ కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలిపారు. అలాగే ఈ మొబైల్ బ్యాక్ సెట్‌లో రెండు కెమెరా సెన్సార్లు, LED లైట్‌తో డైమండ్-ప్యాటర్న్ డిజైన్‌ను కలిగి ఉంటుంది . దీంతోపాటు మొబైల్ కస్టమర్స్‌ని ఆకర్షించేందుకు కొత్త కలర్ వేరియంట్‌లో అద్భుతమైన డిజైన్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ వివరాల్లోకి వెళితే..Vivo Y17s మొబైల్ చాలా పవర్ఫుల్ 6.56-అంగుళాల IPS LCD డిస్‌ప్లేతో అందుబాటులోకి రాబోతోంది. దీంతోపాటు ఈ స్క్రీన్ 720 x 1612 పిక్సెల్‌ల HD+ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. అలాగే 60Hz రిఫ్రెష్ రేట్ కు సపోర్ట్ చేస్తుంది.
ఇక ఈ స్మార్ట్ ఫోన్ డిస్ప్లే 840 నిట్‌ల వరకు బ్రైట్ నెస్‌ను అందిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన ప్రాసెసర్ విషయానికొస్తే, ఇది ఎంతో శక్తివంతమైన MediaTek Helio G85 ప్రాసెసర్‌తో అందుబాటులోకి రాబోతున్నట్టు తెలుస్తోంది.. దీంతోపాటు 6GB LPDDR4x ర్యామ్, 128 GB eMMC 5.1 స్టోరేజ్ ఆప్షన్స్‌లో ఈ మొబైల్ రాబోతోంది. దీంతోపాటు స్టోరేజ్‌ని అదనంగా పెంచుకునేందుకు మెమొరీ కార్డు స్లాట్‌ను కూడా అందిస్తోంది.. అలాగే ఈ మొబైల్ అప్డేట్ వేరియంట్ ఆండ్రాయిడ్ 13-ఆధారిత FunTouch OS 13తో వస్తున్నట్లు తెలుస్తోంది.
దీంతోపాటు ఈ స్మార్ట్ ఫోన్ 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. అలాగే బ్యాక్ సెట్ అప్‌లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో 2-మెగాపిక్సెల్ బోకె లెన్స్ డ్యూయల్ రియల్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇక ఈ మొబైల్ ఛార్జింగ్ బ్యాటరీ విషయానికొస్తే.. ఈ స్మార్ట్ ఫోన్ ఎంతో శక్తివంతమైన 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 5,000mAh బ్యాటరీని కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. అలాగే ఇది డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.0, GPS, USB-C పోర్ట్, 3.5mm ఆడియో జాక్ వంటి అనేక రకాల కనెక్టివిటీ ఫీచర్లతో మన ముందుకు రాబోతున్నట్లు సమాచారం. ఇవే కాకుండా కంపెనీ త్వరలోనే ఈ మొబైల్‌కు సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి