Whatsapp Security Features: వాట్సాప్ కొత్త ఫీచర్లతో వేరే లెవెల్ ఎక్స్‌పిరియన్స్.. వెంటనే అప్‌డేట్ చేసుకోండి

Whatsapp Latest Update: వాట్సాప్ సరికొత్త ఫీచర్లను యూజర్ల అందుబాటులోకి తీసుకువచ్చింది. మూడు సెక్యూరిటీ ఫీచర్లను ప్రవేశపెట్టగా.. వీటితో వినియోగదారులకు వేరే లెవెల్‌ ఎక్స్‌పిరియన్స్‌కు ఫీలవుతారని వాట్సాప్ చెబుతోంది. పూర్తి వివరాలు ఇలా..  

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 17, 2023, 06:42 PM IST
Whatsapp Security Features: వాట్సాప్ కొత్త ఫీచర్లతో వేరే లెవెల్ ఎక్స్‌పిరియన్స్.. వెంటనే అప్‌డేట్ చేసుకోండి

Whatsapp Latest Update: కోట్లాది వినియోగదారులున్న వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత అప్‌డేట్స్‌తో యూజర్లకు సరికొత్త అనుభూతిని ఇస్తోంది. యూజర్లకు మరింత వేగంగా సేవలు అందిస్తూ.. డేటాను సురక్షితంగా మార్చేందుకు నిరంతరం కృషి చేస్తోంది. ఇప్పటికే వాట్సాప్‌లో అనేక రకాల ఫీచర్లు ఉన్నాయి. ఇటీవల కొత్త ఫీచర్లను కూడా యూజర్లకు వాట్సాప్ అందుబాటులోకి తీసుకువచ్చింది. కొత్తగా మూడు సెక్యూరిటీ ఫీచర్స్‌ను ప్రారంభించింది. మీరు డేటా గురించి ఆందోళన చెందుతుంటే.. ఈ కొత్త ఫీచర్లతో మీ బెంగ తీరనుంది. ఆ ఫీచర్లు ఎంటి..? ఎలా పనిచేస్తాయి..? పూర్తి వివరాలు ఇలా..

వాట్సాప్ అందుబాటులోకి తీసుకువచ్చిన మొదటి ఫీచర్ అకౌంట్ ప్రొటెక్షన్. దీని వాట్సాప్ యూజర్లు సులభంగా కొత్త డివైజ్‌కు మారిపోవచ్చు. అదేవిధంగా అప్‌డేట్ చేసిన తర్వాత కొన్ని నెలల పాటు అదనపు సెక్యూరిటీ లేయర్‌ను అందిస్తుంది. అది డివైజ్‌లను మార్చేందుకు పర్మిషన్ ఇస్తుంది. 

రెండో ఫీచర్ డివైజ్ వెరిఫికేషన్. ఇది డివైస్‌లో మాల్వేర్ ఆటాక్స్‌ నుంచి యూజర్ల డేటాను రక్షించడానికి పని చేస్తుంది. ఈ ఫీచర్ సెక్యురిటీ ప్యాకేజీలో రూపొందించారు. వినియోగదారు నుంచి ఎటువంటి ఎక్స్‌ట్రా సెక్యూరిటీ అవసరం లేదు. వినియోగదారులు వాట్సాప్‌ను వారు కోరుకున్న విధంగా యూజ్ చేసుకోవచ్చు. వారి అకౌంట్‌ను పూర్తి సెక్యూర్‌గా ఉంచేందుకు డివైజ్ వెరిఫికేషన్ వర్క్ చేస్తుంది. 

Also Read: Minister Harish Rao: వాళ్లు ఎగిరెగిరి పడుతున్నారు.. ఏపీ మంత్రులపై హరీష్‌ రావు మరోసారి సీరియస్  

ఆటోమేటిక్ సెక్యూరిటీ కోడ్ అనే మూడో ఫీచర్‌ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది మెసెజ్‌లు Encrypted, సెక్యూర్‌గా ఉండేలా చూస్తుంది. ఎన్‌క్రిప్షన్ ట్యాబ్‌పై క్లిక్ చేసి యూజర్లు సెక్యూరిటీ కనెక్షన్‌ను వెరీఫై చేసుకోవచ్చు. ఈ ప్రక్రియను కీ టాన్స్‌పరెన్సీ అంటారు. యూజర్ల చాట్‌లు ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేసి ఉన్నాయని ఆటోమేటిక్‌గా వెరీఫై చేసేందుకు పర్మిషన్ ఇస్తుందని వాట్సాప్ వివరించింది. వాట్సాప్‌ చేర్చిన కొత్త ఫీచర్లు వినియోగదారులకు నెక్ట్స్‌ లెవెల్ ఎక్స్‌పిరియన్స్‌ను అందించడమే కాకుండా.. యూజర్ అకౌంట్‌ను పూర్తిగా ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ ఫీచర్లతో వాట్సాప్ యూజర్లు గతంలో కంటే ఎక్కువగా డేటాను ప్రొటెక్ట్ చేసుకుంటూ చాటింగ్ చేసుకోవచ్చు.

Also Read: Karnataka Assembly Elections 2023: బీజేపీకి భారీ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన మాజీ ముఖ్యమంత్రి  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News