Harish Rao Serious Comments On AP Ministers: ఏపీ మంత్రులపై మరోసారి సీరియస్ అయ్యారు మంత్రి హరీష్ రావు. కొందరు నాయకులు ఏం చేయలేకున్నా ఎగిరెగిరి పడుతున్నారంటూ కౌంటర్ ఇచ్చారు. ఉన్నది అంటే ఉలిక్కి పడుతున్నారని అన్నారు. సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఏపీ నాయకులు ప్రత్యేక ప్రత్యేక హోదా కోసం ఎందుకు మాట్లాడటం లేదని.. విశాఖ ఉక్కు కోసం ఎందుకు పోరాటం లేదని నిలదీశారు. పోలవరం పనులు ఎందుకు కావడం లేదని తాను అన్నానని.. ఇందులో ఏమైనా తప్పుందా..? అని అడిగారు.
తాను ప్రజల పక్షాన మాట్లాడాను తప్ప.. ఏపీ గురించి తప్పుగా మాట్లాడలేదని హరీష్ రావు అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో చెమట చుక్కలు కార్చిన ప్రతి ఒక్కరూ తమ బిడ్డలే అని చెప్పానని.. ఏపీ ప్రజలు ఇక్కడ సెటిల్ అయితే చల్లగా ఉండండి.. బాగుండాలని అన్నానని చెప్పారు. తాము ఏపీ గురించి ఏనాడూ తప్పుగా మాట్లాడలేదని క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో అన్ని బాగున్నాయి.. ఇక్కడే ఉండండి అని ఆ రోజు అన్నానని గుర్తు చేశారు. కానీ ప్రజలను.. ఏపీని కించపరిచే విధంగా మాట్లాడానని కొందరు నాయకులు అనడం అది వారి విజ్ఞతకు వదిలేస్తున్నానని అన్నారు. అడిగినదానికి సమాధానం చెప్పలేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. చేతనైతే జాతీయ హోదా కోసం పోరాడండి.. విశాఖ ఉక్కు కోసం పోరాడండి అంటూ చురకలు అంటించారు. పోలవరం తొందరగా పూర్తి చేసి కాళేశ్వరం లాగా నీళ్లు అందించాలన్నారు.
ఇటీవల మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు తీవ్రస్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే. ఏపీలో అక్కడ ఓటు హక్కును రద్దు చేసుకుని.. తెలంగాణలో పొందాలని హరీష్ రావు సూచించగా.. ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఒకరి తరువాత ఒకరు ఆయన విమర్శలు గుప్పించారు. ఏపీలో పథకాలను వివరిస్తూ.. తెలంగాణలో ఇలాంటి పథకాలు ఉన్నాయంటూ నిలదీశారు. తెలంగాణలో ఏముందంటూ ప్రశ్నలు సంధించారు.
Also Read: New Tax Regime 2023: కొత్త పన్ను విధానం ఉపయోగాలు ఇవే.. ఆ బెనిఫిట్స్ మాత్రం లేవు
ఈ వ్యాఖ్యలకు మంత్రి హరీష్ రావు కూడా గట్టిగా కౌంటర్ ఇస్తూనే వస్తున్నారు. తెలంగాణలో రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని.. ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుందని అన్నారు. తెలంగాణ పథకాల గురించి చెబుతూ.. అనవసరంగా తమ జోలికి రావొద్దంటూ హెచ్చరిస్తున్నారు.
Also Read: Karnataka Assembly Elections 2023: బీజేపీకి భారీ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన మాజీ ముఖ్యమంత్రి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook