WhatsApp Block Spam: వాట్సాప్ గురించి నేటితరం వారికి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఫోన్లో ఏ యాప్ అన్నా ఉండకుండా పోవచ్చు కానీ వాట్సాప్ యాప్ లేని ఫోన్ మాత్రం మనకు కనిపించదు అనడంలో అతిశయోక్తి లేదు. అంతగా మన ఫోన్లో భాగమైపోయింది ఈ అప్లికేషన్. కాల్స్, మెసేజెస్ కన్నా కూడా మన రోజు వారి కమ్యూనికేషన్ ఈ వాట్సాప్ ద్వారానే జరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు ఫోన్లు.. కాల్స్ కోసం మాత్రమే ఉపయోగించుకునే వాళ్ళం అనేవారు.. ప్రస్తుతం ఎలా మారిపోయిందంటే ఫోన్ కేవలం వాట్సాప్ కోసమే ఉపయోగిస్తున్నాం అనేలా మారిపోయింది.
కాగా యూజర్స్ కి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఎక్స్పీరియన్స్ ని ఇచ్చేందుకు నిత్యం కృషి చేసే దిగ్గజ సోషల్ మీడియా సంస్థల్లో వాట్సాప్ ఒకటి.. గతేడాది అనేక సరికొత్త ఫీచర్స్ని లాంచ్ చేసింది. వాటిల్లో ముఖ్యమైనది 'ఛానెల్స్' ఫీచర్. ఈ ఫీచర్.. యూజర్స్కి చాలా బాగా నచ్చింది. ఇక ఇప్పుడు.. 2024లో కూడా అనేక కొత్త ఫీచర్స్ని తీసుకొచ్చేందుకు.. ఏర్పాట్లు చేసుకుంటోంది ఈ మెటా ఆధారిత వాట్సాప్.
ఈ నేపథ్యంలో.. ఒక కొత్త ఫీచర్ ని ఆల్రెడీ అప్డేట్ చేసింది. ఇక వాట్సాప్ లో కొత్త ఫీచర్ రావడంతో.. యూజర్స్ అది ఏమిటో తెలుసుకోవాలని తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇంతకీ వాట్సాప్ లో వచ్చిన కొత్త ఫీచర్ ఏమిటి అంటే లాక్ స్క్రీన్ నుండి స్పామ్‌ని బ్లాక్ చేయవచ్చు. తాజాగా అప్డేట్ చేయబడిన ఈ ఫీచర్ వినియోగదారులను అవాంఛిత నోటిఫికేషన్‌లు, ప్రకటనలతో సహా అన్ని స్పామ్, తెలియని సందేశాలను బ్లాక్ చేయడానికి అనుమతిస్తుంది. దీని ద్వారా మనము అనవసరమైన మెసేజెస్ ఓపెన్ చేయకుండా…లాక్ స్క్రీన్ లోనే బ్లాక్ చేసే అవకాశాన్ని అందిస్తోంది వాట్సాప్. దీనివల్ల మనకు టైం సేవ్ అవ్వడమే కాదు.. అనవసరమైన మెసేజెస్ ఓపెన్ చేసి దాంట్లో ఏమన్నా లింక్ క్లిక్ చేస్తే ఏమవుతుంది అనే భయం కూడా ఉండదు. ఇక వాట్సాప్ తెచ్చిన ఈ కొత్త ఫీచర్ విని వాట్సాప్ యూజర్స్ తెగ సంబరపడుతున్నారు.
ఈమధ్య ఎక్కువగా చాలామందికి స్పామ్ మెసేజెస్ వస్తూ ఉండటంతో వాట్సాప్ కి నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.
Also Read: Oppo A59: ఫ్లిప్‌కార్ట్‌లో ఒక్కసారిగా తగ్గిన Oppo A59 మొబైల్ ధర..ఎగబడి కొంటున్న జనాలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter