Honor Foldable Phone: 16జీబీ ర్యామ్, 1టీబీ స్టోరేజ్‌తో ప్రపంచంలోనే అత్యంత సన్నని ఫోల్డబుల్ ఫోన్ త్వరలో

Honor Foldable Phone: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఇటీవల ఫోల్డబుల్ ఫోన్స్ క్రేజ్ పెరుగుతోంది. స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఒకదానివెంట మరొకటి ఫోల్డబుల్ మోడల్స్ లాంచ్ చేస్తున్నాయి. ఇప్పుడు  Honor నుంచి కొత్తగా ఫోల్టబుల్ ఫోన్ లాంచ్ అయింది. త్వరలో ఇండియాలో అందుబాటులో రానుంది. ఈ ఫోన్ ప్రత్యేకతలు, ధర తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 22, 2024, 10:22 AM IST
Honor Foldable Phone: 16జీబీ ర్యామ్, 1టీబీ స్టోరేజ్‌తో ప్రపంచంలోనే అత్యంత సన్నని ఫోల్డబుల్ ఫోన్ త్వరలో

Honor Foldable Phone: ప్రపంచ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో Honor ఎంట్రీ ఇచ్చేసింది. Honor Magic V2 పేరుతో కొత్త ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. త్వరలో ఇండియా మార్కెట్‌లో రానున్న ఈ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. ఇందులో ఒకటి Honor Magic V2 కాగా రెండవది Honor Magic V2 RSR.ఇందులో Honor Magic V2 6.43 ఇంచెస్ డిస్‌ప్లే కలిగి ఉంటే Honor Magic V2 RSR 7.92 ఇంచెస్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తోంది. 

Honor Magic V2,Honor Magic V2 RSR రెండూ ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 2 చిప్‌సెట్ ప్రోసెసర్ కలిగి ఉంటుంది. ఈ రెండు ఫోన్లు 16జీబీ ర్యామ్ కలిగి 1టీబీ వరకూ స్టోరేజ్ సామర్ధ్యంతో ఉంటాయి. త్రిబుల్ కెమేరా సెటప్ ఉంటుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ రిజల్యూషన్ కలిగి ఉంటాయి. కేవలం 9.9 ఎంఎం మందంతో మాత్రమే ఉంటాయి. 

వీటిలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 20 మెగాపిక్సెల్ టెలీఫోటో కెమేరాతో పాటు సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 16 మెగాపిక్సెల్ కెమేరా ఉన్నాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి 66 వాట్స్ ఫాస్ట్‌ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో 16 జీబీ ర్యామ్, 1టీబీ స్టోరేజ్ ధర యూరప్‌లో అయితే 2 లక్షల 42 వేలుగా ఉంది. ఇండియాలో కాస్త తక్కువగా ఉండవచ్చు లేదా అదే ధరకు అందుబాటులో రావచ్చు. 

Honor Magic V2 ఫోల్టబుల్ కాకుండా హానర్ నుంచి మరో స్మార్ట్‌ఫోన్  Honor 200 Pro ఇండియాలో ఈ ఏడాది చివర్లో లాంచ్ కానుంది. బ్లూ, గ్రీన్, వైట్ కలర్స్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. ఇందులో కూడా 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా ఉంటుంది. 

Also read: Jio AirFiber Plans: ఎయిర్ ఫైబర్‌తో 550 ఛానెల్స్ 14 ఓటీటీలు, 1 Gbps స్పీడ్ ఇంటర్నెట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News