సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మన్నగూడ వద్ద రాజీవ్ రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Last Updated : May 27, 2018, 10:44 AM IST
సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మన్నగూడ వద్ద రాజీవ్ రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును లారీ, క్వాలిస్, సుమో ఢీకొన్న ప్రమాదంలో 11మంది చనిపోగా, అనేక మందికి గాయాలయ్యాయి. రోడ్డుపై ప్రయాణిస్తున్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన బస్సు ఢీకొన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని గాంధీ, యశోద ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి

సిద్దిపేట జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటన పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు.

రోడ్డు ప్రమాద బాధితులను మంత్రి మహేందర్‌రెడ్డి పరామర్శించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని తక్షణమే మెరుగైన ఆసుపత్రిలో చికిత్స అందించాలని మంత్రి ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన మంత్రి.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షలు, ఆర్టీసీ తరుపున మరో రూ.2 లక్షలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రమాదాలు జరగకుండా చూడాలని మంత్రి ఈసందర్భంగా ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.

Trending News