నలుగురు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులతో సహా 16 మంది ఉపాధ్యాయులపై కేసు నమోదయ్యింది. టెన్త్ పబ్లిక్ పరీక్షకు గంట ముందు వాట్సాప్ గ్రూప్లో టెన్త్ ప్రశ్నాపత్రాలను లీక్ చేసినందుకు వీరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆదిలాబాద్ జిల్లాలోని నార్నూర్లోని ఒక పాఠశాలలో మాస్ కాపీయింగ్ ఆరోపణలు రావడంతో.. పాఠశాలను పరీక్షించిన అనంతరం తెలంగాణ పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. నివేదికల ప్రకారం, ఉపాధ్యాయులు మాథ్స్, సైన్స్ మరియు ఆంగ్ల ప్రశ్నాపత్రాలను సమాధానాలతో సహా వెల్లడించారు.
ఈ లీకేజీ ఆయా కేంద్రాలకే పరిమితం అయ్యిందా?, ఇతర కేంద్రాలకు కూడా ప్రశ్నాపత్రాలు వెళ్లాయా? అన్న దానిపై విచారణ కొనసాగుతోంది. విషయం తేలాకే.. పరీక్షను రద్దు చేయాలా? వద్దా? అనేది తేలనుంది. ఈ లీకేజీ తంతు ఇలా ఉండగా.. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. ఒకవేళ పరీక్షను రద్దు చేస్తే.. కష్టపడి చదివిన విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు వాపోతున్నారు. మార్చి 15 న ప్రారంభమైన టెన్త్ పరీక్షలు ఏప్రిల్ 2 వరకు కొనసాగుతాయి.