వాహనానికి ప్రెస్, పోలీస్ అని పెట్టుకున్నారా.. ఇక అంతే!

ఈ మధ్యకాలంలో వాహనాల మీద స్టిక్కర్లను అతికించడం భలే ఫ్యాషన్ అయిపోయింది.

Last Updated : Mar 1, 2018, 04:34 PM IST
వాహనానికి ప్రెస్, పోలీస్ అని పెట్టుకున్నారా.. ఇక అంతే!

హైదరాబాదు: ఈ మధ్యకాలంలో వాహనాల మీద స్టిక్కర్లను అతికించడం భలే ఫ్యాషన్ అయిపోయింది. బైకులు, కార్ల మీద ఇష్టమైన స్టిక్కర్లను అంటించి యువత రోడ్ల మీద షికారు చేస్తున్నారు. పోలీస్, ప్రెస్, ఆర్మీ, గవర్నమెంట్ అంటూ వివిధ రకాల స్టిక్కర్స్ అంటించుకొని తిరగడం మొదలుపెట్టారు. ఎవరు నిజమో, అబద్దమో తెలియక ట్రాఫిక్ పోలీసులు ఇబ్బందులు పడుతున్నారు.

డూప్లికేట్ వాళ్లని పట్టుకోవడం కోసం పోలీసులు స్పెషల్ డ్రైవ్ ను ప్రారంభించారు. తనిఖీలు చేసినప్పుడు డూప్లికేట్ అని తేలితే వాళ్లని రోడ్డుపైనే ఆపి, ఆ స్టిక్కర్లను తొలగించి, వార్నింగ్ ఇస్తున్నారు. అదే వాహనాలకు చలాన్లు ఉంటే స్వాధీనం చేసుకుంటున్నారు. ఇలా పట్టుబడ్డ వారిలో సోహన్ లాల్ అనే యువకుడు హవాలా రాకెట్ లో పట్టుబడగా, అతని వద్ద నకిలీ ప్రెస్ ఐడీ కార్డు ఉందని పోలీసులు గుర్తించారు. 

గడిచిన రెండు రోజుల్లో నగరంలో 80కి పైగా ఇలాంటి వాహనాలు పట్టుబడ్డాయని, పట్టుబడిన వారికి జరిమానా విధించామని పోలీసులు తెలిపారు. పోలీసులు, ప్రెస్ తో సంబంధం ఉన్నవారే ఇలా చేస్తున్నారన్నారు.  పరిచయం ఉన్న పోలీసులను, నిజమైన విలేకరులుగా ఉన్న వారినీ ఏమీ అనడం లేదని, వారి వాహనాలకు స్టిక్కర్ ఉండవచ్చని చెబుతున్నారు. అక్రమంగా వాడుతున్న వారి వాహనాలకు ఒకసారి స్టిక్కర్స్ తొలగించాక మళ్లీ అటువంటివే కనిపిస్తే ఒప్పుకొనేది లేదని, కేసు ఫైల్ చెయ్యాల్సి వస్తుందని పోలీసులు చెప్పారు. 

Trending News