Voting On liquor shop: మా ఏరియాలో వైన్స్​ వద్దంటూ 95 శాతం మంది ఓటింగ్!

Voting on liquor shop: వైన్స్ షాప్ అనుమతుల కోసం బిడ్డింగ్ వేయడం తేలుసు గానీ.. వైన్స్ ఉండాలా వద్దా అనేందుకు ఓటింగ్ జరపడం చూశారా? ఆ కథేమిటో చూసేయండి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 15, 2022, 12:10 PM IST
  • వైన్స్​ దుకాణం కోసం ఓటింగ్​
  • స్థానికుల వ్యతిరేకతతో నిర్ణయం
  • సర్వేలో ఆశ్చర్యకరమైన ఫలితాలు
Voting On liquor shop: మా ఏరియాలో వైన్స్​ వద్దంటూ 95 శాతం మంది ఓటింగ్!

Voting on liquor shop: సాధారణంగా పట్టణాల్లో మద్యం దుకాణాలు రోడ్ల పక్కల ఉండటం సర్వ సాధారణం. హైదరాబాద్​లో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే హైదరాబాద్​లోనే.. తమ కాలనీలో ఓ వైన్స్​ ఉండటాన్ని స్థానికులు వ్యతిరేకించారు. ఇందుకు కొత్త రకం పరిష్కారాన్ని ఆలోచించి.. దానిని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఇంతకీ ఏమైందంటే..

హైదరాబాద్​లోని బేగంపేట గురుమూర్తిలేన్​లో ఉన్న మద్యం దుకాణాన్ని తొలగించాలని స్థానికులు ఆందోళన చేపడుతున్నారు. అన్ని అనుమతులు తీసుకునే ఆ వైన్స్​కు అక్కడ ఏర్పాటు చేశారు నిర్వాహకులు. దీనితో ఈ విషయంపై కొంత కాలంగా రచ్చ సాగుతోంది.

ఈ సమస్య పరిష్కారానికి ఆ ప్రాంతానికి చెందిన స్థానికులు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పర్సెప్షన్‌ స్టడీస్‌ అనుబంధ సంస్థ అయిన 'హక్కు ఇన్షియేటివ్‌ అండ్‌ ఛానల్‌'ను సంప్రదించారు.

ఈ సంస్థ మద్యం దుకాణం ఉండాలా? వద్దా? అనే విషయంపై స్థానికుల అభిప్రాయాలను సేకరించింది. ఆ వైన్స్​కు 500 మీటర్ల పరిధిలో ఉన్న వ్యాపార సముదాయాలు, ఇళ్లలోని ప్రజలపై ఓటింగ్ నిర్వహించింది. వైన్స్​ ఉండాలా వద్దా అనే విషయం చెప్పమని కోరింది.

ఇందులో మొత్తం 1479  మంది పాల్గొన్నారు. అందులో మహిళలు 737 మంది కాగా.. 742 మంది పురుషులు ఉన్నారు.

చివరకు ఏం తేలింది?

ఈ అభిప్రాయ సేకరణలో పాల్గొన్న వారిలో 95.67 శాతం మంది తమ ఏరియాలో వైన్స్​ ఉదొద్దని ఓటు వేశారు. కేవలం 3.58 శాతం మంది మాత్రమే మద్యం దుకాణం ఉండాలని తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. 0.75 శాతం ఓట్లు చెల్లుబాటు కాలేదు. దీనితో స్పష్టంగా ఆ ఏరియాలో మద్యం దుకాణం వద్దు అనే వారే ఎక్కువగా ఉండటం వల్ల.. హక్కు ఇన్షియేటివ్‌ అండ్‌ ఛానల్‌ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. స్థానికంగా నిర్వహించిన ఓటింగ్ ఫలితాలను కూడా పిటిషన్​లో పొందుపరిచింది.

మరి కోర్టు స్థానికుల అభిప్రాయం మేరకు కోర్టు వైన్స్​ను అక్కడి నుంచి తరలించాలని చెబుతుందా? లేదా నిబంధనలు పాటిస్తూ అక్కడే ఉండాలని తీర్పునిస్తుందా? అనేది త్వరలో తేలనుంది.

Also read: CM Kcr: భాజపా నేతలకు దమ్ముంటే నన్ను జైలుకు పంపండి: సీఎం కేసీఆర్‌

Also read: Medaram Jatara 2022: మేడారం జాతరకు కేంద్రం నిధులు... కిషన్ రెడ్డి కీలక ప్రకటన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News