Aadi Srinivas: సాగునీటి ప్రాజెక్టుల్లో అసంపూర్తి పనులను పూర్తి చేసి రైతులకు నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం వేములవాడ నియోజకవర్గంలోని మల్కాపేట రిజర్వాయర్, లచ్చపేట ప్రాజెక్టు, కథలాపూర్ మండలంలోని కలికోట సూరమ్మ చెరువు, వేములవాడ రూరల్ మండలంలోని మర్రిపల్లి ప్రాజెక్టును అధికారులతో కలిసి సందర్శించారు. అనంతరం వేములవాడలో అధికారులతో కలిసి ప్రాజెక్టులపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. 90 శాతం పనులు పూర్తయి అసంపూర్తిగా ఉన్న 10 శాతం పనులను పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. రాష్ట్రంలోని 9 ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన వాటిలో శ్రీ పాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ మొదటి ప్రాధాన్యత క్రమంలో చేర్చారని, మల్కాపేట రిజర్వాయర్ కూడా ఉందన్నారు.

శ్రీ పాద ఎల్లంపల్లి ప్రాజెక్టును 2005 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రూ 1737 కోట్లను మంజూరు చేసి ప్రారంభించారన్నారు. స్టేజి 1 పేజ్ 1 లో భాగంగా  2009లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టుల తప్ప కొత్త ప్రాజెక్టులు ఏవిలేవన్నారు. 2009 సంవత్సరంలో మునుపే ఫాజుల్ నగర్ ప్రాజెక్ట్, రుద్రంగి నాగారం చెరువు రిజర్వాయర్, చందుర్తి రిజర్వాయర్ పూర్తి చేసుకున్నాయని గుర్తు చేశారు.. వేములవాడ నియోజకవర్గంలో 1 లక్ష ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టులను వినియోగములోకి తెస్తున్నామన్నారు. 

90 శాతం పూర్తయిన మలకపేట రిజర్వాయర్ లో మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేయడానికి సుమారు రూ 20 కోట్లు వెచ్చించి రైతులకు 30 వేల ఎకరాలకు నీరు అందిస్తామన్నారు. కలికోట సూరమ్మ చెరువు ద్వారా 43 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు.. కలికోట సూరమ్మ చెరువు కుడి ఎడమ కాలువలకు నిర్మాణానికి భూ సేకరణ నిమిత్తం నోటిఫికేషన్ త్వరలోనే మంజూరు చేయడం జరుగుతుందని రైతులందరూ సహకరించాలని పేర్కొన్నారు.

గతంలో కలికోట సూరమ్మ చెరువు రిజర్వాయర్, మర్రిపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి అనేక ఆందోళన చేశామని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడ నియోజకవర్గం పరిధిలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన వివరాలను మొన్నటి రోజు జలసౌతాలో జరిగిన మీటింగ్లో అధికారులను అడిగి తెలుసుకున్నారని తెలిపారు. అనంతరం ఈఎన్సి అనిల్ కుమార్ మాట్లాడుతూ.. నీటి లభ్యత ఉండి టెక్నికల్ ఫీజుబిలిటీ బడ్జెట్ ప్రకారం  ప్రాధాన్యత క్రమంలోని ప్రాజెక్టులను పూర్తిచేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలున్నాయన్నారు. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రాజెక్టులను సందర్శిస్తున్నట్లు అయన తెలిపారు. రాష్ట్రంలోని పంప్ హౌస్‌ల పైన నేడు రంగనాయక సాగర్ లో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Also Read: 200Mp Drone Camera Phone: యాపిల్, సాంసంగ్ ఇక షెడ్డుకే.. 2025 విడుదలయ్యే vivo 200MP కెమెరా మొబైల్ చూస్తే ఆశ్చర్యపోతారు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

English Title: 
Aadi Srinivas: State Government Whip Said Telangana Government's Target Is To Provide Irrigation To One Lakh Acres
News Source: 
Home Title: 

Aadi Srinivas: లక్ష ఎకరాలకు సాగునీరు అందింస్తాం.. అభివృద్ధే మా లక్ష్యం..

Aadi Srinivas: లక్ష ఎకరాలకు సాగునీరు అందింస్తాం.. అభివృద్ధే మా లక్ష్యం..
Caption: 
source file- zee telugu news
Yes
Is Blog?: 
No
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
లక్ష ఎకరాలకు సాగునీరు అందింస్తాం.. అభివృద్ధే మా లక్ష్యం..
Dharmaraju Dhurishetty
Publish Later: 
No
Publish At: 
Friday, November 1, 2024 - 17:13
Created By: 
Cons. Dhurishetty Dharmaraju
Updated By: 
Cons. Dhurishetty Dharmaraju
Published By: 
Cons. Dhurishetty Dharmaraju
Request Count: 
1
Is Breaking News: 
No
Word Count: 
325

Trending News