Asaduddin Owaisi Car Attack: ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్‌పై దుండగులు కాల్పులు చేపట్టిన విషయం తెలిసిందే. యూపీలో ఎన్నికల ప్రచారం పూర్తి చేసుకుని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) ఢిల్లీ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. హాపుర్, గాజీయాబాద్ నేషనల్ హైవేపై ఛాజర్సీ టోల్‌ప్లాజా వద్ద ఈ ఘటన జరిగింది.
ఇక రంగంలోకి దిగిన పోలీసులు (Police) కాల్పులకు పాల్పడిన వారిలో కొందరిని అరెస్ట్ చేశారు. మరికొందరు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే తనపై పెద్ద కుట్రే జరిగిందని.. అల్లా (Allah) దయతో ప్రాణాలతో బయటపడ్డానంటూ అసదుద్దీన్ పేర్కొన్నారు.
ఛాజర్సీ టోల్‌గేట్ వద్ద (Chhajarsi Toll Plaza) తన కారుపై నాలుగు రౌండ్స్ కాల్పులు (Four Rounds Firing) జరిగాయని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. నలుగురు దుండగులు ఈ కాల్పులు చేపట్టారని.. తర్వాత ఆయుధాల్ని అక్కడే పడేసి పరారయ్యారని పేర్కొన్నారు. తన కారు (Car) పంక్చర్ కావడంతో వేరే వాహనంలో వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయానని అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు.
ఇక ప్రజలు, మజ్లిస్ పార్టీకి చెందిన వారు ఎవరూ ఆందోళనపడొద్దని సూచించారు. అలాగే తనపై జరిగిన దాడికి కారకులు ఎవరు అనే విషయాన్ని ఉత్తరప్రదేశ్, (Uttar Pradesh) కేంద్ర ప్రభుత్వాలే తేల్చాలని కోరారు.
ఈ క్రమంలో భారత ప్రభుత్వం అసదుద్దీన్ ఒవైసీ సెక్యూరిటీపై సమీక్ష చేపట్టింది. ఆయనకు సీఆర్‌పీఎఫ్ జెడ్ కేటగిరీ సెక్యూరిటీని అందించిందనున్నట్లు భారత ప్రభుత్వం తెలిపింది.
As per reliable sources, the Government of India has reviewed the security of AIMIM MP Asaduddin Owaisi and provided him with Z category security of CRPF with immediate effect.
(file photo) pic.twitter.com/J0fmwSn0HR
— ANI (@ANI) February 4, 2022
ఇక ఒవైసీపై (Owaisi) దాడి కేసులో ఇద్దరు షూటర్స్‌ను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. కాగా అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) గతంలో చేసిన హిందూ వ్యతిరేక ప్రసంగాల వల్లే కొందరు దుండగులు ఈ దాడికి పాల్పడ్డారంటూ యూపీ పోలీసుల విచారణలో తేలిందని ఉత్తరప్రదేశ్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook