Bandi Sanjay: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విభజన చట్టం ద్వారా ఏర్పడిందని, స్వాతంత్య్ర వచ్చినప్పటి నుంచి తెలంగాణకు చాలా అన్యాయం జరిగిందని, మిడ్ మానేరు కు సంబంధించిన విషయంలో కూడా అలాగే జరిగిందని.. అందుకే దాని పై రైల్ కం బ్రిడ్జి నిర్మాణం కోసం బండి సంజయ్ కేంద్రంను ఒప్పించాలని కరీంనగర్ మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కోరారు. 365బి రహదారిని కోరుట్ల వరకు పొడగింపుకు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల అర్బన్ రగుడు వద్ద టిఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశములో మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విభజన చట్టం ద్వారా ఏర్పడిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక కేంద్ర ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. స్వాతంత్య్ర వచ్చినప్పటి నుంచి తెలంగాణకు చాలా అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
జాతీయ రహదారి 365 సూర్యాపేట నుంచి దుద్దెఢ వరకు ఉండేదని, దానిని దుద్దేడ నుంచి సిరిసిల్ల మీదుగా కోరుట్లకు వరకు రహదారి విస్తరించాలని ప్రతిపాదించడం జరిగిందని ఆయన వెల్లడించారు. 365 బి జాతీయ రహదారిని సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో నుంచి కాకుండా, ప్రతిపాదనలో ఉన్న రైల్వే ట్రాక్ కు ప్యారలల్ గా నిర్మాణం చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞ్యప్తి చేశారు.
మిడ్ మానేర్ పై రైల్ కం బ్రిడ్జి నిర్మాణం కోసం బండి సంజయ్ కేంద్రంను ఒప్పించాలని, 365 బి రహదారిని కోరుట్ల వరకు ఎక్స్టెన్షన్ కు కృషి చేయాలని ఆయన కోరారు. జాతీయ రహదారుల నిర్మాణంకు ఎవరు కూడా అడ్డుపడవద్దని భూ యజమానులకు సూచించారు. భూ నిర్వాసితులకు రెట్టింపు పరిహారం ఇవ్వాలని, లేని ఎడల తమ పార్టీ ముందుండి ఉధ్యమాలు చేస్తుందని ఆయన అన్నారు. బండి సంజయ్ తిట్ల పురాణం బందు చేసి, జాతీయ రహదారి ఎక్సటెన్షన్ కోసం కృషి చేయాలని ఆయన విజ్ఞ్యప్తి చేశారు..
Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.