హైదరాబాద్: అసంతృప్తులను బుజ్జగించే పనిలో ఉన్న టి.కాంగ్రెస్ .. పార్టీకి చెందిన ప్రముఖ నిర్మాత బండ్లగణేష్ పై కనికరం చూపింది. ఈ క్రమంలో ఆయనకు పీసీసీకి చెందిన కీలక పదవి కట్టబెట్టింది. అసెంబ్లీ సీటు ఆశించి భంగపడ్డ బండ్ల గణేశ్ కు తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా నియమించింది. ఈ మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నియమాక ఉత్తర్వులు జారీచేసింది.
తన సొంత నియోజకవర్గమైన షాద్ నగర్ లేదా రాజేంద్ర నగర్ అసెంబ్లీ స్థానాల్లో ఏదో ఒక స్థానం కేటాయిస్తారనని బండ్ల గణేశ్ ఆశించారు. అయితే మహాకూటమిలోని సీట్ల సర్దుబాటు కారణంతో ఆయనకు సీటు కేటాయించలేకపోయారు. దీంతో గణేశ్ ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ అధిష్టానం వద్ద తన అసంతృప్తి చేయగా.. ఆయన్ను బుజ్జగించే క్రమంలో ఈ మేరకు పార్టీ పదవి ఇచ్చినట్లు తెలిసింది.
బండ్ల గణేశ్‌కు గుడ్ న్యూస్ చెప్పిన కాంగ్రెస్