Bharat Rice Sellers in Hyderabad: హైదరాబాద్‌లోని ఈ లొకేషన్లలో కేవలం రూ. 29 కే కిలో సన్న బియ్యం..

Bharat Rice Sellers in Hyderabad: కేంద్ర ప్రభుత్వం పేదలకే కాకుండా మధ్యతరగతి కుటుంబాలు కూడా లబ్ది చేకూరేలా కొన్ని పథకాలను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా భారత్‌ రైస్ పేరుతో దేశవ్యాప్తంగా కేవలం రూ. 29 కే సన్నబియ్యం విక్రయాలు చేప్టటింది.

Written by - Renuka Godugu | Last Updated : Apr 13, 2024, 02:22 PM IST
Bharat Rice Sellers in Hyderabad: హైదరాబాద్‌లోని ఈ లొకేషన్లలో కేవలం రూ. 29 కే కిలో సన్న బియ్యం..

Bharat Rice Sellers in Hyderabad: కేంద్ర ప్రభుత్వం పేదలకే కాకుండా మధ్యతరగతి కుటుంబాలు కూడా లబ్ది చేకూరేలా కొన్ని పథకాలను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా భారత్‌ రైస్ పేరుతో దేశవ్యాప్తంగా కేవలం రూ. 29 కే సన్నబియ్యం విక్రయాలు చేప్టటింది. ముఖ్యంగా ద్రవ్యోల్బణం నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు ఈ భారత్‌ రైస్ విక్రయాలు చేపట్టింది. దేశవ్యాప్తంగా ఇది వరకే వీటి విక్రయాలు ప్రారంభమయ్యాయి. తాజాగా హైదరాబాద్‌లో కూడా భారత్ రైస్ విక్రయాలు ప్రారంభమయ్యాయి. సబ్సిడీ ధరలకే హైదరాబాద్‌లోని పలు రైస్‌ విక్రయాల కేంద్రాల ద్వారా కేవలం రూ.29 కే సన్నబియ్యం అందుబాటులోకి వచ్చేశాయి.ఈ భారత్ రైస్ విక్రయాలు నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NAFED), నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ (NCCF) ద్వారా విక్రయించాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం.

ఇదీ చదవండి: తెలుగు నేలతో బాబా సాహెబ్ అంబేద్కర్ అనుబంధం..

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రూ.29 కే కిలో సన్నబియ్యం విక్రయాలు ప్రారంభమయ్యాయి. 
చంద్రమౌళి ట్రేడర్స్- కార్వాన్, 
ఏపీ రైస్ స్టోర్- మెట్టుగూడ
ధనలక్ష్మి ఎంటర్ ప్రైజెస్, డింగ్‌ డాంగ్‌ సూపర్ మార్కెట్ - ఎస్‌ఆర్ నగర్
మాణిక్య ట్రేడర్స్- ఆర్కేపురం
గౌతమ్ రైస్ డిపో, లంగర్ హౌజ్ జై తుల్జా భవాని ఏజెన్సీ- కాప్రా
మురళి కిరణా అండ్‌ జనరల్ స్టోర్ పటాన్ చేరు, ముత్తయ్య గ్రాండ్‌ బజార్ శేర్లింగంపల్లి, రిలయన్స్ దేవరయంజాల, శ్రీ ట్రేడర్స్- చందానగర్, ఉజ్వల్ ట్రేడర్స్- మల్లేపల్లి, ఉప్పు రాజయ్య ట్రేడర్స్- షాపూర్ నగర్, శ్రీసాయిబాబా రైస్ డిపో- కార్వాన్, సిర్వి ట్రేడర్స్- బోడుప్పల్, శ్రీఅంబా ట్రేడర్స్ హైదరాబాద్. శ్రీ బాలాజీ రైస్ డిపో రాంనగర్, శివ సాయి ట్రేడర్స్ కర్మాన్ ఘాట్, శ్రీగోవిద ట్రేడర్స్ కాచిగూడ, శ్రీ వీరభద్ర ట్రేడర్స్ కవాడిగూడ, శ్రీ ట్రేడర్స్ కొత్తపేట

ఇదీ చదవండి: ఖమ్మం పాలిటిక్స్ లో కీలక పరిణామం.. భట్టి, తుమ్మల ఏకమై.. పొంగులేటికి చెక్..?

కేంద్ర ప్రభుత్వం తొలి దశలో 5 లక్షల టన్ను బియ్యాన్ని కేటాయించింది. సాధారణంగా సన్న బియ్యం అంటే కిలో రూ. 40 పెట్టనిదే రాకుండా ఉంది. ఈనేపథ్యంలో రూ. 29 కే కిలో సన్న బియ్యం విక్రయాలు చేపడుతున్నారు. ఇప్పటికే భారత్ దాల్, భారత్‌ వీట్ పేర్లతో పప్పు, గోధుమ పిండిని అతి తక్కువ ధరకే విక్రయిస్తుంది.ఈనేపథ్యంలో ప్రస్తుతం రూ. 29 కే సన్న బియ్యం విక్రయాలు చేపట్టింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News