Bhoiguda Fire Accident: బోయిగూడ అగ్నిప్రమాదంపై ప్రత్యక్ష సాక్షి ప్రేమ్ వెల్లడించిన కీలక వివరాలు..

Bhoiguda Fire Accident: సికింద్రాబాద్‌ బోయిగూడలోని స్క్రాప్ గోదాంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 11 మంది సజీవ దహనమైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి బయటపడిన ఒకే ఒక్కడు ప్రేమ్ కుమార్ ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 23, 2022, 08:03 PM IST
  • బోయిగూడలో భారీ అగ్నిప్రమాదం
  • ప్రమాద ఘటనపై ప్రత్యక్ష సాక్షి ప్రేమ్ స్టేట్‌మెంట్
  • పోలీసులకు కీలక వివరాలు వెల్లడించిన ప్రేమ్
Bhoiguda Fire Accident: బోయిగూడ అగ్నిప్రమాదంపై ప్రత్యక్ష సాక్షి ప్రేమ్ వెల్లడించిన కీలక వివరాలు..

Bhoiguda Fire Accident: సికింద్రాబాద్‌ బోయిగూడలోని స్క్రాప్ గోదాంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 11 మంది సజీవ దహనమైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి బయటపడిన ఒకే ఒక్కడు ప్రేమ్ కుమార్ ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాద ఘటనపై ప్రత్యక్ష సాక్షి ప్రేమ్ కుమార్ పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. బిట్టు, పంకజ్ అనే ఇద్దరితో పాటు తాను ఒక చిన్న గదిలో నిద్రించామని... మిగతా 9 మంది పక్కనే ఉన్న పెద్ద గదిలో పడుకున్నారని తెలిపాడు.

తెల్లవారుజామున 3 గంటల సమయంలో గోదాంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయని.. ఆ వెంటనే క్షణాల్లో గోదాం నిండా పొగ వ్యాపించిందని ప్రేమ్ కుమార్ చెప్పాడు. అందరం బయటపడేందుకు ప్రయత్నించామని.. కానీ అప్పటికే మంటలు వ్యాపించడంతో సాధ్యం కాలేదన్నాడు. ఎలాగోలా ధైర్యం చేసి.. తాను కిటికీలో నుంచి బయటకు దూకేశానని చెప్పాడు. మిగతావారంతా మంటల్లోనే చిక్కుకుని కాలిపోయారని తెలిపాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత తనను గుర్తించి గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నాడు.

అగ్నిప్రమాదానికి గోదాం యజమాని నిర్లక్ష్యమే కారణమని ప్రేమ్ కుమార్ ఆరోపించాడు. అతనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు. ప్రేమ్ కుమార్ స్టేట్‌మెంట్‌తో స్క్రాప్ గోదాం యజమాని సంపత్‌పై పోలీసులు 304ఏ, 337 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం సంపత్ పోలీసుల అదుపులోనే ఉన్నాడు. 

స్క్రాప్ గోదాం అగ్రిప్రమాద ఘటనలో చనిపోయినవారంతా బీహారీలే. పొట్టకూటి కోసం వలస వచ్చిన ఈ నిరుపేద కార్మికులు ఇలా అగ్నిప్రమాదంలో సజీవ దహనమవడం చాలామందిని కలచివేసింది. ఘటనపై ప్రధాన నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మృతులకు సీఎం కేసీఆర్ రూ.5 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.  

Also Read: Bhagat Singh Facts: భగత్​సింగ్ గురించి ఈ నిజాలు మీకు తెలుసా?

Upendra New Look: కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర షాకింగ్ లుక్...

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News